Pat Cummins: ఆ ఒక్క నిర్ణయంతో ఫిదా.. ధోనిలాగానే ఆలోచిస్తున్న SRH కెప్టెన్ కమిన్స్

కమిన్స్ మహేంద్ర సింగ్ ధోని లాంటివాడు. చాలామంది ఆలోచించని నిర్ణయం తీసుకోవడానికి ధోని సిద్ధంగా ఉంటాడు. కమిన్స్ కూడా ధోని లాగే నిర్ణయాలు తీసుకున్నాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 6, 2024 3:20 pm

Pat Cummins

Follow us on

Pat Cummins: ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా శుక్రవారం రాత్రి చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జట్టు ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది. హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ ను మాజీ క్రికెటర్లు అభినందిస్తున్నారు. అతడు ఇలాంటి విజయాలను హైదరాబాద్ జట్టుకు మరిన్ని అందించాలని కోరుతున్నారు. గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఓటమిని ఎదుర్కొన నేపథ్యంలో.. చెన్నై తో జరిగే మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు పై ఎవరికీ ఎటువంటి ఆశలు లేవు. ఈ నేపథ్యంలో అందరి అంచనాలను హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ తలకిందులు చేస్తూ జట్టును గెలిపించాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో జట్టును ముందుండి నడిపించాడు. ఫలితంగా హైదరాబాద్ జట్టు చెన్నై పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ విజయం సాధించిన నేపథ్యంలో కెప్టెన్ కమిన్స్ నాయకత్వంపై సర్వత్రా అభినందనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కమిన్స్ కెప్టెన్సీ పై దిగ్గజ క్రికెటర్ టామ్ మూడీ కీలక వ్యాఖ్యలు చేశారు.ఎన్ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు 165 పరుగులు చేసింది.. లక్ష్యాన్ని చేదించే క్రమంలో హైదరాబాద్ ఆటగాళ్లు అభిషేక్ శర్మ (37), మార్క్రమ్(50) పరుగులతో సత్తా చాటారు.

“ఈ మ్యాచ్లో కమిన్స్ వినూత్నమైన నిర్ణయాలు తీసుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ కు బదులుగా అభిషేక్ శర్మతో ఓపెనింగ్ బౌలింగ్ చేయించాడు.. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు ఓపెనింగ్ ఆటగాడు రచిన్ రవీంద్ర(12) భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో మార్క్రమ్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కమిన్స్ ఈ వైవిధ్యాన్ని ప్రదర్శించడంతో చెన్నై జట్టు తొలి వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ తో పాటు నటరాజన్, షాబాజ్ అహ్మద్, జయ దేవ్ ఉనద్కత్ తో బౌలింగ్ చేయించి చెన్నై జట్టుపై కమిన్స్ ఒత్తిడి పెంచాడు. చివరి ఓవర్ లో రవీంద్ర జడేజా అవుట్ అయినప్పటికీ.. మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ కు రాకుండా కమిన్స్ సరికొత్త ప్రణాళిక అమలు చేశాడు. ఎంపైర్ కు అప్పీల్ చేయకుండా ధోనిని డ్రెస్సింగ్ రూమ్ లోనే కట్టడి చేశాడు. ఫలితంగా చివరి ఓవర్ లో చెన్నై భారీ స్కోరు సాధించలేకపోయిందని” మూడీ వ్యాఖ్యానించాడు.

“కమిన్స్ మహేంద్ర సింగ్ ధోని లాంటివాడు. చాలామంది ఆలోచించని నిర్ణయం తీసుకోవడానికి ధోని సిద్ధంగా ఉంటాడు. కమిన్స్ కూడా ధోని లాగే నిర్ణయాలు తీసుకున్నాడు.. అభిషేక్ శర్మను ఓపెనర్ గా పంపించడం కమిన్స్ తీసుకున్న అతి గొప్ప నిర్ణయం. కెప్టెన్ పై ఉంచిన నమ్మకాన్ని అభిషేక్ శర్మ కాపాడుకున్నాడు.. చెన్నై బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. అతడు చేసిన భారీ స్కోరు హైదరాబాద్ జట్టుకు విజయాన్ని కట్టబెట్టింది” అని మూడీ పేర్కొన్నాడు.. కాగా, ఈ విజయంతో నాలుగు మ్యాచ్ లు అడి రెండింటిలో విజయం, మరో రెండింటిలో పరాజయం పాలైంది. పాయింట్ల పట్టికలో నాలుగు పాయింట్లతో ఐదవ స్థానంలో కొనసాగుతోంది.. హైదరాబాద్ జట్టుతో ఓడిపోయినప్పటికీ చెన్నై జట్టు నెట్ రన్ రేట్ కారణంగా హైదరాబాద్ కంటే మెరుగైన స్థానంలో ఉంది.