PAK vs SA: స్వదేశంలో పాకిస్తాన్ జట్టుతో దక్షిణాఫ్రికా మూడు టి20 సిరీస్ ఆడుతుంది. ఇందులో భాగంగా మొదటి మ్యాచ్ డిసెంబర్ 10న, డర్బన్ వేదికగా జరుగుతుంది.. పాకిస్తాన్ జట్టులోకి బాబర్ అజాం తిరిగి వచ్చాడు.. పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ గాయానికి గురై.. ఇటీవల చికిత్స పొంది, ప్రస్తుత సిరీస్ కు అందుబాటులోకి వచ్చాడు. మాజీ కెప్టెన్ బాబర్ కూడా సిద్ధంగా ఉన్నాడు. జట్టుకు రిజ్వాన్ నాయకత్వం వహించనున్నాడు. 2019 తర్వాత పాకిస్తాన్ – దక్షిణాఫ్రికా ఆల్ ఫార్మాట్ సిరీస్ లో పోటీ పడటం ఇదే తొలిసారి. మూడు టి20ల సిరీస్ తర్వాత పాకిస్తాన్, దక్షిణాఫ్రికా 3 వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడతాయి.. దక్షిణాఫ్రికా తో జరిగిన చివరి రెండు టీ20 సిరీస్ లలో పాకిస్తాన్ విజయం సాధించింది. ఫిబ్రవరి 2021లో స్వదేశంలో జరిగిన టి20 సిరీస్లో దక్షిణాఫ్రికా ను ఓడించి.. పాకిస్తాన్ ట్రోఫీ దక్కించుకుంది. ఏప్రిల్ 2021 లో దక్షిణాఫ్రికాలో జరిగిన టి20 సిరీస్లో పాకిస్తాన్ 3-1 తేడాతో గెలుపును సొంతం చేసుకుంది. ఇటీవల స్వదేశంలో భారత జట్టుతో జరిగిన టి20 సిరీస్లో దక్షిణాఫ్రికా ఓటమిపాలైంది.
అంతకుముందు టి20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ చేతిలో ఓడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో దక్షిణాఫ్రికా బలంగానే కనిపిస్తున్నప్పటికీ.. కీలక సమయంలో చేతులెత్తేయడం ఆ జట్టుకు ప్రధాన అవరోధంగా మారింది. ఇది ఆ జట్టు విజయావకాశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇక పాకిస్తాన్ కూడా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్ లో ఓటమిపాలైంది. ఆ జట్టు కెప్టెన్ రిజ్వాన్ గాయం నుంచి కోలుకొని.. ఈ మ్యాచ్ కు అందుబాటులోకి వచ్చాడు.. వైట్ బాల్ ఫార్మాట్ లో ఇటీవల కాలంలో పాకిస్తాన్ చెప్పుకోదగిన విజయాలను నమోదు చేయలేకపోయింది. అనామక జింబాబ్వే పై మాత్రమే సిరీస్ గెలిచింది. ఇటీవల కాలంలో పాకిస్తాన్ సాధించిన విజయం ఇది మాత్రమే. మరోవైపు భారత్ చేతిలో స్వదేశంలో t20 సిరీస్ ఓడిపోవడం, అంతకుముందు రెండు ద్వైపాక్షిక సిరీస్ లలో ఓటమి పాలు కావడంతో.. దక్షిణాఫ్రికా ఈసారి పాకిస్థాన్ పై ఎలాగైనా నెగ్గాలని భావిస్తోంది. ఇందులో భాగంగా యువకులకు పెద్దపీట వేసింది.
జట్టుకూర్పు ఇదీ
దక్షిణాఫ్రికా
క్లాసెన్(కెప్టెన్), బార్ట్ మాన్, బ్రిట్జ్ కే, ఫెరీర, హెండ్రిక్స్, పాట్రిక్ కృూగర్, జార్జి లిందే, మపాక, డేవిడ్ మిల్లర్, నోర్ట్జే, పీటర్, రికెల్టన్, తప్రైజ్ స్హ మ్నెసి, షామ్ నెసి.
పాకిస్తాన్
మహమ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ అజాం, హరీస్ రౌఫ్, జహందాద్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, తాహిర్, షాహిన్షా ఆఫ్రిది, ఓమైర్బిన్ యూసఫ్, సైమ ఆయుబ్, సల్మాన్ అలీ అఘ, మహమ్మద్ హస్నైన్, మహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్.
పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టి20 డర్బన్ లో జరుగుతుంది. ఈ మ్యాచ్ స్పోర్ట్స్ 18 నెట్వర్క్ లో ప్రసారమవుతుంది. జియో సినిమా యాప్ లోనూ లైవ్ ప్రసారం చూడొచ్చు.