South Africa vs Australia : సౌతాఫ్రికా.. టీ20లో మంచి బలమైన టీం ఉన్న జట్టు. ఎయిడెన్ మార్క్రమ్ సౌతాఫ్రికా లీగ్ లో జట్టును గెలిపించడంతో టీ20 జాతీయ జట్టు బాధ్యతలు దక్కాయి. దీంతో సౌతాఫ్రికా కెప్టెన్ గా సిరీస్ లలో విజయాలు కట్టబెట్టాడు. కానీ బలమైన ఆస్ట్రేలియా ధాటికి సౌతాఫ్రికా నిలవలేకపోయింది.
నిజానికి ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్స్ కమిన్స్ గాయపడడంతో కొత్త కెప్టెన్ గా కుర్రాడు అయిన ‘మిచెల్ మార్ష్’కు పగ్గాలు అప్పజెప్పింది క్రికెట్ ఆస్ట్రేలియా. దీంతో నూతన సారథిగా బాధ్యతలు చేపట్టిన మార్ష్ ఎవ్వరూ ఊహించని విధంగా జట్టును నడిపిస్తూ తనూ చెలరేగాడు. ఒంటిచేత్తో మొదటి , రెండో టీ20లను సౌతాఫ్రికాపై గెలిపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి ఆస్ట్రేలియాకు విజయాలను అందించాడు. ఇక మార్ష్ వ్యూహాలు బాగా పనిచేశాయి. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ సొంత దేశంలో సొంత మైదానాల్లో పరుగులు చేయలేక ఔట్ అయిపోయారు.
ఫలితంగానే టీ20 సిరీస్ ను 3-0తో కోల్పోయిన సౌతాఫ్రికా ఇప్పుడు అదే ఆస్ట్రేలియాపై వన్డే పోరుకు రెడీ అయ్యింది. తొలి వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ గా మార్క్రమ్ స్థానంలో టెంబా బవుమా బాధ్యతలు చేపట్టారు. అయినా కూడా సౌతాఫ్రికా మారలేదు. ఆస్ట్రేలియా ధాటికి సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ పరుగులు చేయడానికి తడబడుతున్నారు. 12 ఓవర్లకే 33 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది జట్టు. ప్రస్తుతం పోరాడుతోంది.