South Africa Vs Nepal: బాబోయ్.. సౌత్ ఆఫ్రికా ను నేపాల్ ఇలా ఆడేసుకుందేంటి? కూసింతలో పరువు దక్కింది

నేపాల్ జట్టు ఒక్క పరుగు తేడాతో ఓడిపోయినప్పటికీ నైతికంగా ఆ జట్టు విజయం సాధించింది. సర్వత్రా ప్రశంసలు పొందుతోంది. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా సూపర్ -8 కు వెళ్లిపోయింది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 15, 2024 11:13 am

South Africa Vs Nepal

Follow us on

South Africa Vs Nepal: టి20 వరల్డ్ కప్ లో మరో సంచలనం నమోదయిందయ్యేదే. ఒక్క పరుగు తేడాలు తప్పిపోయింది కానీ.. లేకుంటే షాకింగ్ రిజల్ట్ వచ్చేదే.. అనామక నేపాల్ జట్టు సౌత్ ఆఫ్రికాకు చుక్కలు చూపించింది.. ఒక్క పరుగు తేడాతో సౌత్ ఆఫ్రికా పరువు దక్కించుకుంది. లేకుంటే ఇజ్జత్ మొత్తం పోయేది.. శనివారం సౌత్ ఆఫ్రికా, నేపాల్ జట్ల మధ్య గ్రూప్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా ను నేపాల్ వణికించింది. స్థూలంగా చెప్పాలంటే ఓడించిందనే అనుకోవాలి. అయితే కీలకమైన సమయంలో దక్షిణాఫ్రికా ఈసారి ఒత్తిడిని జయించింది. నేపాల్ జట్టుపై విజయం సాధించింది.. మూడు బంతుల్లో నాలుగు పరుగులు, రెండు బంతుల్లో రెండు పరుగులు చేయాల్సిన సమయంలో.. ప్రత్యర్థి జట్టుగా నేపాల్ ఉంది కాబట్టి దక్షిణాఫ్రికా బతికిపోయింది. లేకుంటే ఒత్తిడి తట్టుకోలేక చేతులెత్తేసింది. తన క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఒత్తిడి సమయంలో ఎన్నో మ్యాచ్ లను దక్షిణాఫ్రికా పోగొట్టుకుంది.. చివరికి ఒక పరుగు తేడాతో విజయం సాధించి.. బతుకు జీవుడా అనుకుంటూ ఊపిరి పీల్చుకుంది.

నేపాల్ జట్టు ఒక్క పరుగు తేడాతో ఓడిపోయినప్పటికీ నైతికంగా ఆ జట్టు విజయం సాధించింది. సర్వత్రా ప్రశంసలు పొందుతోంది. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా సూపర్ -8 కు వెళ్లిపోయింది.. ఒకవేళ అలా జరగకుండా ఉంటే కచ్చితంగా ఆ జట్టుపై తీవ్రమైన ఒత్తిడి ఉండేది.. సౌత్ ఆఫ్రికా విధించిన 116 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో.. నేపాల్ ఒకానొక దశలో రెండు వికెట్లకు 85 పరుగులు చేసి, పటిష్ట స్థితిలో ఉంది. దశలో సౌత్ ఆఫ్రికా బౌలర్లు పుంజుకున్నారు. మెరుగ్గా బౌలింగ్ చేసి నేపాల్ జట్టును చరిత్ర సృష్టించేందుకు ఒక్క పరుగుదూరంలో నిలిపారు.. మ్యాచ్ ఓడిపోయినప్పటికీ.. నేపాల్ ఆటగాళ్ల ప్రదర్శనతో సౌత్ ఆఫ్రికా జట్టు తీవ్రంగా ఇబ్బంది పడింది.

ఇక ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. హెన్ డ్రిక్స్ 43, స్టబ్స్ 27 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. క్వింటన్ డికాక్, మార్క్రం, క్లాసెన్, డేవిడ్ మిల్లర్ దారుణంగా విఫలమయ్యారు. నేపాల్ బౌలర్లలో దీపేంద్ర సింగ్ 3, కుషాల్ నాలుగు వికెట్లు పడగొట్టి, సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్ ను నేల కూల్చారు.

116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేదించేందుకు రంగంలోకి దిగిన నేపాల్ జట్టు.. అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించింది. రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 85 పరుగులు చేసింది. దాదాపు విజయాన్ని ఖాయం చేసుకుంది. అయితే ఇదే క్రమంలో సౌత్ ఆఫ్రికా బౌలర్లు మెరుగ్గా బౌలింగ్ చేశారు. కీలక సమయంలో నేపాల్ జట్టును ఇబ్బంది పెట్టారు. చివరి 4 బంతుల్లో నేపాల్ విజయానికి 8 పరుగులు అవసరమైన సమయంలో.. గుల్సన్ బౌండరీ బాదాడు. దీంతో చివరి మూడు బంతుల్లో నాలుగు పరుగులు చేయాల్సిన సమయంలో.. నేపాల్ రెండు పరుగులు సాధించింది. ఇక చివరి రెండు బంతుల్లో రెండు పరుగులు కావాల్సిన సమయంలో.. దక్షిణాఫ్రికా బౌలర్ బార్ట్ మన్ వరుసగా రెండు బంతులను బౌన్సర్లుగా సంధించడంతో నేపాల్ గెలుపు ముంగిట ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది.