https://oktelugu.com/

Yoga: యోగా ఎప్పుడు చేయాలి? ఈ విషయం తెలుసుకోవాల్సిందే

రోజూ యోగా చేయడం వల్ల చాలా ఉత్తేజం వస్తుంది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను యోగా తరిమి కొడుతుంది. ఉదయం సమయం దొరకని వారు సాయంత్రం కూడా యోగా చేస్తుంటారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : June 15, 2024 11:23 am
    Yoga

    Yoga

    Follow us on

    Yoga: ప్రతి రోజు ఉదయం యోగా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. వ్యాయామం, వాకింగ్, యోగా అందరి లైఫ్ లో ఒక భాగం అయితే ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. అయితే.. చాలా మంది యోగాను ఉదయమే చేస్తుంటారు. ఉదయమే చేయాలి అనుకుంటారు కూడా. దీనిలో నిజమెంత..? యోగా ఉదయం మాత్రమే చేయాలా..? సాయంత్రం చేయకూడదా? చేస్తే ప్రయోజనాలు ఉండవా అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

    రోజూ యోగా చేయడం వల్ల చాలా ఉత్తేజం వస్తుంది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను యోగా తరిమి కొడుతుంది. ఉదయం సమయం దొరకని వారు సాయంత్రం కూడా యోగా చేస్తుంటారు. అయితే.. ఉదయం చేయడం వల్ల ఎంత ప్రయోజనం ఉందో… సాయంత్రం యోగా చేయడం వల్ల కూడా అంతే ప్రయోజనాలు చేకూరుతాయి అంటున్నారు నిపుణులు. సాయంత్రం యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాత్రి మంచి నిద్ర కూడా పడుతుందట. ఇవే కాదు మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

    రోజంతా అలసిపోతే, సాయంత్రం యోగా చేయడం వల్ల ఆ రోజు అలసట, ఒత్తిడి, ఆందోళన నుంచి త్వరగా బయటపడవచ్చు. దీనివల్ల రాత్రిపూట మంచి నిద్ర మీ సొంతం అవుతుంది. మీరు పగటిపూట ఏదైనా కోపంగా అనిపిస్తే మనసు గందరగోళంగా అనిపిస్తే కూడా యోగా ద్వారా సాయంత్రం దాన్ని వదిలించుకోవచ్చు. ఈ సమయంలో చేసే యోగా మీ మనస్సును ప్రశాంతపరిచి, ఒత్తిడిని లేకుండా చేస్తుంది.

    ఉదయం ఉద్యోగాల వల్ల పనుల వల్ల యోగా చేయడానికి సమయం కుదరకపోవచ్చు. దీనికోసం షెడ్యూల్‌ రూపొందించుకున్నా.. పాటించడం కూడా కష్టమే అవుతుంది. అందుకని, సాయంత్రం ఎక్కువ సమయం ఉంటుంది కాబట్టి ఎలాంటి గందరగోళం లేకుండా ఆ సమయంలో యోగా చేసుకుంటే సరిపోతుంది. .