Homeక్రీడలుక్రికెట్‌Sourav Ganguly: షోయబ్ అక్తర్ బౌలింగ్లో పక్కటెముకలు విరిగిపోయాయి.. అంతటి బాధనూ సచిన్ బయటకు చెప్పలేదు:...

Sourav Ganguly: షోయబ్ అక్తర్ బౌలింగ్లో పక్కటెముకలు విరిగిపోయాయి.. అంతటి బాధనూ సచిన్ బయటకు చెప్పలేదు: వీడియో వైరల్

Sourav Ganguly: వన్డేలు, టెస్టులలో సచిన్ నెలకొల్పిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. దేశవాళి క్రికెట్లోనూ సచిన్ సంచనాలను సృష్టించాడు. టీమిండియా కు అద్భుతమైన విజయాలను అందించాడు. అందువల్లే సచిన్ టెండూల్కర్ ను క్రికెట్ గాడ్ గా కొనియాడుతారు. బ్యాటింగ్లో ప్రయోగాలు చేసి.. ఫీల్డింగ్లో ప్రమాణాలు నెలకొల్పి.. బౌలింగ్లో వైవిధ్యాన్ని ప్రదర్శించి.. ఇలా క్రికెట్లో సమున్నతంగా వెలుగొందిన ఆటగాడిగా సచిన్ నిలిచిపోయాడు. అందువల్లే అతడు సాధించిన రికార్డులను బ్రేక్ చేయడం మరే ఆటగాడికి సాధ్యం కావడం లేదు. అతడు క్రికెట్ కు గుడ్ బై చెప్పి దశాబ్దం దాటిపోయినప్పటికీ.. ఇతర ఆటగాళ్లు దరిదాపుల్లోకి వచ్చారు గాని.. ఆ రికార్డులను బద్దలు కొట్టలేకపోయారు. మరోవైపు సచిన్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ప్రపంచ విహారిగా మారిపోయారు. తన శ్రీమతితో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలను చుట్టివస్తున్నారు. దానికి సంబంధించిన విశేషాలను సామాజిక మాధ్యమాలలో పంచుకుంటున్నారు. తన అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారు. ఐదు పదుల వయసు లోకి వచ్చినప్పటికీ.. సచిన్ నేటికీ అదే గ్లామర్ కొనసాగిస్తున్నారు.

తెలియని కోణం

సచిన్ టెండూల్కర్ జీవితం తెరిచిన పుస్తకమే అయినప్పటికీ.. ఆయన జీవితంలో ముఖ్యంగా క్రీడా జీవితంలో అభిమానులకు తెలియని ఓ విషయాన్ని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో గంగూలీ ఈ విషయాన్ని చెప్పారు.” పాక్ జట్టుతో మేము తలపడుతున్నాం. స్ట్రైకర్ గా సచిన్ ఉన్నాడు. షోయబ్ బౌలింగ్ వేస్తున్నాడు. అప్పటికి ఓ బంతి సచిన్ పక్కటెముకలను బలంగా తాకింది. ఆ దృశ్యాన్ని కళ్లారా చూసాను. వెంటనే సచిన్ వద్దకు వెళ్లాను . అంతా ఓకే కదా అని అడిగాను. దానికి సచిన్ సరే అని తల ఊపాడు. మ్యాచ్ చివరి వరకు క్రీజ్ లో ఉన్నాడు. ధాటిగా బ్యాటింగ్ చేసి జట్టును గెలిపించాడు. అయితే మరుసటి రోజు నేను సచిన్ ను చూడగా.. అతని పక్కటెముకలకు రెండు ఫ్రాక్చర్లు అయ్యాయి. ఆ తర్వాత అతడు నాకు మరో విధంగా కనిపించాడు. అందుకే సచిన్ అంటే నా జీవితంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. అతడు అంటే ప్రత్యేక గౌరవం ఉంటుంది. అతడు ఆటకు వన్నెతెచ్చిన ఆటగాడు. క్రికెట్ స్థాయిని పెంచిన ఆటగాడు. క్రికెట్లో అరుదైన రికార్డులు సృష్టించిన ఆటగాడు. అందువల్లే సచిన్ లేకుండా క్రికెట్ ప్రస్తావన తీసుకురావడం సాధ్యం కాదు. ఆటపై అద్భుతమైన ముద్ర వేసిన ప్లేయర్ అతడు. అందువల్లే అతని ఇప్పుడే కాదు మరిప్పుడు కూడా క్రికెట్ గాడ్ అని సంబోధిస్తుంటాం. ఇలా అనడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదని” గంగూలీ వ్యాఖ్యానించాడు. అయితే గంగూలీ నాయకత్వంలో సచిన్ ఎన్నో మ్యాచులలో టీమిండియను గెలిపించాడు. గంగూలీతో కలిసి సుదీర్ఘమైన ఇన్నింగ్స్ లు ఆడాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Football Legends Retirement

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...
US Iran Conflict

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...
FIFA World Cup Revenue

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...
Amitabh Bachchan

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...
YSRCP Land Scam

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...
Oktelugu Epaper