Prabhas Busy Schedule: బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో గొప్ప గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్…ఆయన చేసిన ప్రతి సినిమా అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెడుతున్నాయి… నిజానికి ప్రభాస్ ఆ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడు. నటన మీద మక్కువతో మెలుకువలు నేర్చుకొని టాప్ లెవల్ కి దూసుకెళ్లాడు. అందువల్లే ఆయన ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు నిజానికి ప్రభాస్ ఆ స్థాయికి రావడానికి చాలా రకాల కష్టాలు పడ్డాడు. నటన మీద మక్కువతో మెలుకువలు నేర్చుకొని మంచి నటుడిగా ఎదిగాడు. అందువల్లే ఆయన ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు… ప్రస్తుతం ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో ‘రాజసాబ్’ అనే సినిమా చేశాడు. ఇక డిసెంబర్ 5 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇక ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీస్ ముగిసిన వెంటనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్ 2’, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2’ లాంటి సినిమాలను కూడా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక వీటితోపాటుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కూడా ఒక సినిమాకి కమిట్ అయ్యాడు…
ఇక వీటితోపాటు సుకుమార్ దర్శకత్వంలో కూడా సినిమా చేస్తాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇక. మొత్తానికైతే ఒక ఐదు సంవత్సరాల పాటు ప్రభాస్ నాన్ స్టాప్ గా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నంలో ఉన్నాడు… బాహుబలి టైమ్ లో బాగా గ్యాప్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఎప్పుడు గ్యాప్ రానివ్వకుండా వరుస సినిమాలను చేస్తున్నాడు. మొత్తానికైతే ఇప్పుడు ఆయన కమిట్ అయిన సినిమాలతో ఒక ఐదు సంవత్సరాల పాటు అతని డైరీ ఖాళీ లేకుండా ఫుల్ ఫిల్ చేసుకున్నాడు.
ఇక ఏ దర్శకుడు అతనికి కథ చెప్పిన కూడా ఐదు సంవత్సరాల తర్వాతే అతని సినిమాలు పట్టాలెక్కబోతున్నాయి. ఈ విషయంలో కొత్త డైరెక్టర్ కొంత వరకు నిరాశను వ్యక్తం చేస్తున్నారు… కాబట్టి ఈ విషయంలో ప్రభాస్ సరైన నిర్ణయం తీసుకున్నాడు అంటు అతను అభిమానులు ఆనందపడుతున్నారు. ఇక ప్రతి సంవత్సరం తన నుంచి ఒక సినిమా వస్తుందని ఆయన క్లారిటీ ఇచ్చాడు…