Ind vs Aus 4th Test: ప్రస్తుతం టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతోంది. ఆస్ట్రేలియాతో తలపడుతోంది. పెర్త్ లో జరిగిన తొలి టెస్ట్ ను గెలిచింది. ఏకంగా 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. అయితే అదే జోరు అడి లైడ్ టెస్ట్ లో చూపించలేకపోయింది. 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇక మూడో టెస్టులో మ్యాచ్ ను అతి కష్టం మీద డ్రా గా ముగించింది. అయితే ఈ మూడు మ్యాచ్ లలోనూ మిగతా భారత బౌలర్ల సంగతి ఎలా ఉన్నా.. బుమ్రా మాత్రం అదరగొట్టాడు. పదునైన బంతులు వేసి ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. వికెట్ల మీద వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. అందువల్లే బుమ్రా అంటే ఆస్ట్రేలియా బ్యాటర్లు భయపడుతున్నారు. అయితే ఆ భయాన్ని పోగొట్టడానికి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ సైమన్ కటిచ్ పలు సూచనలు చేశాడు.. మ్యాచ్లో బుమ్రా ఆధిపత్యాన్ని తగ్గించలేమని చెప్పిన అతడు.. అతనిపై ఎదురుదాడికి దిగకపోవడమే మంచిదని ఆస్ట్రేలియా ప్లేయర్లకు ఉద్బోధించాడు.
బాండరీలు వద్దు
బుమ్రా బౌలింగ్ లో బౌండరీల కోసం పాకులాడవద్దని కటిచ్ ఆస్ట్రేలియా ప్లేయర్లకు సూచించాడు. ” బౌండరీల కోసం తాపత్రయపడకండి. సింగిల్స్ లేదా డబ్బులు కోసం ప్రయత్నాలు చేయండి. అలా అయితేనే స్కోరుబోర్డ్ నెమ్మదిగా కదులుతుంది. బంతి పాత బడిన తర్వాత పరుగులు యధావిధిగా వస్తాయి. ఒకవేళ బౌండరీలు కొట్టాలి అనుకుంటే మిగతా బౌలర్ల బౌలింగ్లో ఆ పని చేయండి. బుమ్రా బౌలింగ్లో పొరపాటున కూడా ఎదురుదాడికి దిగొద్దు. ఆ ప్రయత్నమే పూర్తిగా తప్పు. అది మిమ్మల్ని పెవిలియన్ చేర్చుతుంది. వినటానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ గత మూడు టెస్టులలో ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఎదురైన అనుభవం ఇదే. అందువల్ల అతడి బౌలింగ్ ను జాగ్రత్తగా పరిశీలించాలి. నిశితంగా ఆడాలి. అప్పుడే కుదురుకోవడానికి అవకాశం ఉంటుంది. లేనిపక్షంలో ఇబ్బంది పడకు తప్పదు.. బుమ్రా ఎలాంటి బంతులైనా ఇస్తాడు. ఆటగాళ్లను ఎలాంటి ఇబ్బందులైనా పెడతాడు. అందువల్ల ఆటగాళ్లు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ధారాళంగా పరుగులు తీసే హెడ్ వంటి ఆటగాళ్లు సమయమనం పాటించాలని” కటిచ్ పేర్కొన్నాడు..
అందువల్లే..
ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ ఆటగాళ్ల వికెట్లు మొత్తం బుమ్రా నే పడగొట్టాడు. మిగతా బౌలర్ల విషయంలో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా ప్లేయర్లు బుమ్రా విషయానికి వచ్చేసరికి తేలిపోతున్నారు. ఎక్కడ తేడా జరుగుతుందో తెలియడం లేదు గాని.. మొత్తానికైతే చేతులెత్తేస్తున్నారు. అందువల్లే ఆస్ట్రేలియా ఆటగాళ్లకు కటిచ్ ఈ సూచనలు చేస్తున్నాడని.. అక్కడ మీడియా చెబుతోంది. బుమ్రా కు భయపడుతున్నారు కాబట్టి ఆస్ట్రేలియా ఆటగాళ్లు ట్రైనింగ్ తీసుకుంటున్నారని వ్యాఖ్యానించింది.