Kohli and Sachin: ఇప్పుడు దేశ వ్యాప్తంగా క్రికెటర్ల వార్త పెను సంచలనంగా మారింది. పరుగుల యంత్రం విరాట్‌ను వన్డేలకు కెప్టెన్‌గా తొలగించడమే ఇందుకు కారణం. దాదాపు ఆరేండ్లుగా మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ బాధ్యతలను చూస్తున్న విరాట్ కోహ్లీ.. సెప్టెంబర్ లో పొట్టి ఫార్మాట్‌కు టీ20 వరల్డ్ కప్ తర్వాత తాను కెప్టెన్‌గా ఉండబోనని ప్రకటించాడు. అయితే తాను సుదీర్ఘ ఫార్మాట్లకు కెప్టెన్ గా ఉంటానని ప్రకటించాడు విరాట్. అయితే అనూహ్యంగా అతన్ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడం పెను దుమారమే రేపుతోంది.
న్యూజిలాండ్ సిరీస్ కు భారత్ వెళ్లిన తర్వాత బీసీసీఐ ఒక్క ట్వీట్ తో సంచలనం సృష్టించింది. విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో కోహ్లీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోహ్లీని దారుణంగా అవమానించారంటూ బీసీసీఐ మీద విమర్శలు చేశారు. ఇక విరాట్ ప్లేస్ లో కెప్టెన్ గా రోహిత్‌ను నియమించారు. ఇక రోహిత్ బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ విరాట్ మీద ప్రశంసలు కురిపించారు.
కానీ విరాట్ నుంచి మాత్రం దీని మీద ఎలాంటి స్పందన రాలేదు. ఇక విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో గంగూలి స్పందించాడు. పొట్టి ఫార్మాట్‌కు కెప్టెన్ గా ఉండాలని విరాట్‌ను కోరామని, కానీ విరాట్ అందుకు రెడీ లేడని తెలిపారు. కానీ సెలెక్టర్లు మాత్రం వైట్ బాల్ తో ఆడే వన్డే, టీ20లకు ఒక్కరినే కెప్టెన్ గా ఉంచాలనే నిర్ణయంతో రోహిత్‌ను నియమించినట్టు వివరించారు. కోహ్లీ గొప్ప ఆటగాడని, ఈ నిర్ణయంతో అతని మీద ఒత్తిడి తగ్గి గొప్పగా రాణిస్తాడని గంగూలి వివరించారు.
Also Read: Virat Kohli vs BCCI: టీమిండియాలో ముసలం.. కోహ్లీ వదులుకోలేదు.. తొలిగించారన్న మాట
కాగా ఇప్పుడు బీసీసీఐ తీసుకున్న నిర్ణయం గతంలో సచిన్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. సచిన్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు అతనికి చెప్పకుండా బాధ్యతల నుంచి తొలగించినట్టు సచిన్ గతంలో చెప్పాడు. ఈ ఘటనను అతన తీవ్ర అవమానకరంగా భావించాడు. ఇప్పుడు విరాట్ విషయంలో కూడా ఇలాగే బీసీసీఐ అవమానకరంగా వ్యవహరించిందంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇక ఈ వివాదంపై కోహ్లీ తాజాగా స్పందించాడు. రోహిత్ పై ప్రశంసలు కురిపించాడు. తాను దక్షిణాఫ్రికా సిరీస్‌కు అందుబాటులో ఉంటున్నట్టు తెలిపాడు.
Also Read: BCCI: వన్డే సిరీసుకు కోహ్లీ దూరం.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..!