Missamma: సినిమా ప్రేమికులు ఎప్పటిలాగే ఈ రోజు కూడా సినిమా గ్రూప్ లో ఒక చర్చ పెట్టారు. ఆ చర్చలో అడిగిన కీలక ప్రశ్న ఏమిటయ్యా అంటే.. ఎవరైనా సరే అంటే ఏ వయసు ప్రేక్షకుడు అయినా సరే.. జీవితంలో మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్రం ఏమిటి ?. ఇది ప్రశ్న. నిజానికి మళ్ళీ మళ్ళీ చూసే సినిమాలు తెలుగులో ఉన్నాయా ? అంటూ మనలాంటి ప్రేక్షకులు సెటైర్లు వేసే ప్రయత్నం చెయ్యొచ్చు.

అయితే, నిన్నటి తరం యాక్టివ్ ప్రేక్షకులకు పాత సినిమాల పై మక్కువ ఎక్కువ ఉంటుంది కాబట్టి.. అందుకే, వాళ్ళు కొని పాత సినిమాల పేర్లు చెప్పారు. ఆ సినిమాల్లో ఏ సినిమా గొప్ప సినిమా ? అనే కోణంలో మొదలైన చర్చ.. ఎక్కువగా యువకుల మధ్యే జరిగింది. మరీ ముఖ్యంగా ఒక సినిమా పైనే పదే పదే చర్చ జరిగింది, ఆ సినిమా పేరు మిస్సమ్మ.
అయితే, ఎందుకు మిస్సమ్మ చిత్రాన్నే బెస్ట్ చిత్రంగా అంగీకరించాలి ? అని అడిగిన ప్రశ్నలకు కొన్ని ఆసక్తికరమైన సమాధానాలు వచ్చాయి. మిస్సమ్మ సినిమాలో ప్రతి ప్రేక్షకుడికి విపరీతంగా నచ్చే అంశం చక్కని ఫ్యామిలీ హ్యూమర్, అలాగే సినిమాలో అద్భుతమైన ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి. కరెక్ట్ గా అర్ధం చేసుకుంటే.. కథ థీమ్ సినిమాలో ప్రతీ సన్నివేశంలోనూ స్ఫురింపజేశారు దర్శకరచయితలు.
ఇక చివరకు సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ కూడా ఇప్పటికీ ఫ్రెష్ గా ఉంటుంది. కడుపు నింపుకోవడానికి మనిషి ఎన్ని వేషాలు వేస్తాడన్నదే సినిమా మెయిన్ థీమ్. ఈ పాయింట్ చాలా విధాలుగా చూపించి.. సినిమాను నడిపిన విధానం చాలా ముచ్చటగా అనిపిస్తుంది. ఇక ఎన్టీఆర్, సావిత్రి నటన అద్భుతమే. పోటీ పడి మరీ నటించారు.
Also Read: Director Trivikram: నాట్య ప్రదర్శనకు రెడీ అయిన త్రివిక్రమ్ భార్య… సౌజన్య శ్రీనివాస్
రేలంగి పాత్ర వేసే బురిడీలు కూడా బ్రహ్మాండంగా పేలాయి. ఇక ఈ సినిమా పాటలు గురించి ఏమి చెప్పాలి ? నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే మధురమైన నేతి సున్నుండలా ఆ రుచి నాలుక పైనే ఎప్పటికీ అంటుకుపోయేలా ఉంది. ఏది ఏమైనా ఏళ్ళ పాటు మనసులో ఉండిపోయే మంచి పాటలను అందించారు. అందుకే, జీవితంలో మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్రం ఇదే.
Also Read: Balayya: బాలయ్యకి ఎకౌంట్స్ లేకపోయినా సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు !