https://oktelugu.com/

Unstoppable Show: బాలయ్య అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా జక్కన్న… అందరికీ షాక్ ఇచ్చేలా ప్రోమో

Unstoppable Show: నందమూరి నటసింహం బాలకృష్ణ ఒక వైపు సినిమాలు మరో వైపు ఓటీటీ లో సందడి చేస్తూ ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. ఇటీవల ఆయన నటించిన అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అటు వెండితెరపై తన నటనతోనే కాకుండా… ఓటీటీలోనూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్నారు బాలయ్య. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో బాలకృష్ణ హోస్ట్‏గా అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ షోలో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 15, 2021 / 06:05 PM IST
    Follow us on

    Unstoppable Show: నందమూరి నటసింహం బాలకృష్ణ ఒక వైపు సినిమాలు మరో వైపు ఓటీటీ లో సందడి చేస్తూ ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. ఇటీవల ఆయన నటించిన అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అటు వెండితెరపై తన నటనతోనే కాకుండా… ఓటీటీలోనూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్నారు బాలయ్య. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో బాలకృష్ణ హోస్ట్‏గా అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ షోలో ప్రముఖ సెలబ్రెటీలను తనదైన స్టైల్లో ప్రశ్నలను సందిస్తూ.. గేమ్స్‏తో బాలకృష్ణ చేసే సందడి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు ఈ షోకు మంచు మోహన్ బాబు, నాని, బోయపాటి శ్రీను, శ్రీకాంత్, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి వంటి ప్రముఖులు వచ్చి సందడి చేశారు.

    Unstoppable Show

    Also Read: అభిమానులకు డబుల్ ధమాకా ఇచ్చిన “లైగర్”… విజయ్ దేవరకొండ
    తాజాగా అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో డైరెక్టర్ రాజమౌళి, కీరవాణి  విచ్చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. రాజమౌళి రాగానే మీరు ఆల్రెడీ ఇంటలిజెంట్, ఎచీవర్ అని అందరికి తెలుసు. కానీ ఇంకా ఎందుకు ఈ తెల్ల గడ్డం అని బాలకృష్ణ అడగ్గా… గడ్డాన్ని సరిచేసుకున్నారు జక్కన్న. ఆ తర్వాత ఇప్పటివరకు మన కాంబినేషన్ రాలేదు, నా అభిమానులు నిన్ను బాలయ్యతో సినిమా ఎప్పుడు చేస్తున్నావ్ అని అడిగారు. ఇందుకు మీ సమాధానమేంటీ అసలు అని బాలయ్య అడగ్గా… మీసాలు మేలేస్తూ సీరియస్ లుక్ ఇచ్చారు జక్కన్న. అలాగే మీతో సినిమా చేస్తే హీరోకు ఇండస్ట్రీకి హిట్ ఇస్తారు… ఆ తర్వాత వాళ్ల రెండు మూడు సినిమాలు ఫసకే కదా అని బాలయ్య చెప్పారు. ఇందుకు రాజమౌళి ఇది ప్రోమో అని తెలుసు ఆన్సర్స్ ఎపిసోడ్‏లో చెబుతాను అంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ ఫుల్ ఎపిసోడ్ డిసెంబర్ 17న స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం ఈ వీడియొ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    Also Read: ఆ నిర్మాణ సంస్థతో బాలయ్య మల్టీస్టారర్ ఫిక్స్​.. ఇంకో హీరో ఎవరో తెలుసా?