Shreyas Iyer : ఎవరైనా ఒక ఆటగాడు సెంచరీకి దగ్గరగా ఉంటే.. ఆరు నూరైనా సరే దానిని పూర్తి చేయాలనుకుంటాడు. అది వ్యక్తిగత రికార్డు కాబట్టి దానికోసం తహతహలాడుతుంటాడు. అలాంటి సందర్భంలో జట్టు కోసం ఆలోచించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వ్యక్తిగత రికార్డులే క్రికెటర్ల ఆటను ప్రపంచానికి తెలిసేలా చేస్తాయి. కానీ పంజాబ్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇందుకు విరుద్ధంగా ఆలోచించాడు. ఐపీఎల్ లో భాగంగా మంగళవారం గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్టుతో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తన సెంచరీని త్యాగం చేశాడు. జట్టు అవసరాల దృష్ట్యా తన సెంచరీ కంటే.. పరుగులు రావడమే ముఖ్యమని భావించాడు. అందువల్లే పంజాబ్ జట్టు ఓడే మ్యాచ్లో గెలిచింది. అందుకే అంటారు నాయకుడు అంటే నడిచేవాడు కాదు.. నడిపించేవాడని.. దానిని నిజం చేసి చూపించాడు శ్రేయస్ అయ్యర్.
Also Read : నా శ్రమకు తగ్గ ఫలితం దక్కలేదు.. శ్రేయస్ అయ్యర్ సంచలన కామెంట్స్
సెంచరీ వదులుకున్నాడు
గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అయ్యర్ 42 బంతుల్లోనే 97* పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో ఐదు ఫోర్లు ఉంటే.. 9 సిక్సర్లు ఉన్నాయి. అహ్మదాబాద్ మైదానంలో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి… అయ్యర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వాస్తవానికి చివరి ఓవర్ కు ముందే అయ్యర్ 97 పరుగులు చేశాడు. అయితే స్ట్రైకర్ గా ఉన్న శశాంక్ సింగ్ స్ట్రైక్ ఇవ్వకపోవడంతో మూడు అంకెల స్కోర్ చేయలేకపోయాడు. కచివరి ఓవర్లో శశాంక్ సింగ్ 5 ఫోర్లు కొట్టాడు. మొత్తంగా 23 పరుగులు చేశాడు. ఫలితంగా పంజాబ్ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. శశాంక్ సింగ్ ఇవ్వకపోవడంతో అయ్యర్ అభిమానులు అతనిపై మండిపడ్డారు. అయితే దీనిపై శశాంక్ సింగ్ క్లారిటీ ఇచ్చాడు..” అయ్యర్ సెంచరీ చేయకపోవడానికి కారణం నేను కాదు. ఎందుకంటే నన్ను స్వేచ్ఛగా ఆడమని చెప్పాడు. భారీగా పరుగులు చేయాలని సూచించాడు. అందువల్లే నేను అలా చేయాల్సి వచ్చింది. తొలి బంతి నుంచే ఎదురుదాడికి దిగాలని చెప్పాడు. దీంతో నేను అతడు చెప్పినట్టే చేశాను.. టీమ్ మేనేజ్మెంట్ నాకు అండగా నిలిచింది. ఎలాంటి షాట్లు ఆడలో నా ఇష్టానికే వదిలేసింది. సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పటికీ.. జట్టు కోసం మాత్రమే అయ్యర్ ఆలోచించాడు. అయ్యర్ అలా ఆలోచించడం వల్లే పంజాబ్ గెలిచింది. డగ్ అవుట్ లో అయ్యర్ బ్యాటింగ్ చేస్తుంటే ముచ్చటగా అనిపించిందని.. కానీ అతడు తన స్వార్థం చేసుకోకుండా జట్టు కోసం మాత్రమే ఆలోచించాడని” శశాంక్ సింగ్ వ్యాఖ్యానించాడు..
Also Read : సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించారు.. కట్ చేస్తే ఇప్పుడతడు టీమిండియా పాలిట కొత్త దేవుడు..