https://oktelugu.com/

Devara 2 : దేవర 2 లో ట్విస్ట్ ఏంటో చెప్పేసిన ఎన్టీయార్…

Devara 2 : ఇప్పటి వరకు తెలుగులో చాలా మంది హీరోలు సూపర్ సక్సెస్ లను సాధించినప్పటికి ఇప్పుడున్న స్టార్ హీరోలేవ్వరికి సాధ్యం కాని రీతిలో వరుసగా 7 విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఎన్టీయార్ ఇక మీదట చేయబోయే సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాలని చూస్తున్నాడు.

Written By: , Updated On : March 26, 2025 / 10:59 AM IST
Devara 2

Devara 2

Follow us on

Devara 2 : ఇప్పటి వరకు తెలుగులో చాలా మంది హీరోలు సూపర్ సక్సెస్ లను సాధించినప్పటికి ఇప్పుడున్న స్టార్ హీరోలేవ్వరికి సాధ్యం కాని రీతిలో వరుసగా 7 విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఎన్టీయార్ ఇక మీదట చేయబోయే సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన ‘వార్ 2’ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు పాన్ ఇండియా డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘ప్రశాంత్ నీల్’ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు…

నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఆ ఫ్యామిలీ బాధ్యతలు నిలబెట్టడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం హీరోగా బాధ్యతలను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన చేసిన ప్రతి సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని మెప్పించడమే కాకుండా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఆయన చేసిన ప్రతి సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక గొప్ప గుర్తింపు సంపాదించుకుంటున్నాయని చెప్పడంలోకి ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక దేవర (Devara) సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా 500 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమాని జపాన్ లో రిలీజ్ చేసే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఈనెల 28వ తేదీన ఈ సినిమాను జపాన్ లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. మరి అక్కడ కూడా ఈ సినిమా విజయాన్ని సాధించినట్లయితే కలెక్షన్స్ భారీ లెవెల్లో వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక దేవర 2 (Devara 2) సినిమాను సైతం చేయడానికి ఎన్టీఆర్ కొరటాల శివ (Koratala Shiva) తీవ్రమైన కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

Also Read : ‘దేవర 2’ లో ట్విస్టుల మీద ట్విస్టులు..ఆ ఇద్దరు యంగ్ హీరోలు కీలక పాత్రల్లో కనిపించనున్నారా?

ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే దేవర 2 సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసే పనిలో కొరటాల శివ ఉన్నట్టుగా తెలుస్తోంది.

మరి ఈ సినిమాలో ఒక భారీ ట్విస్ట్ కూడా ఉండబోతుందట. ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ ఈ సినిమా గురించి స్పందించాడు…వర దేవరను ఎందుకు చంపాడు అనే ట్విస్ట్ తో ఫస్ట్ పార్ట్ ని ముగించారు. సెకండ్ పార్ట్ లో దానికి కొనసాగింపుగా మరొక ట్విస్ట్ కూడా అదనంగా ఆడ్ చేయబోతున్నారట. అది ఏంటి అనేది ఎవరు చెప్పడం లేదు.

కానీ మొత్తానికైతే ప్రేక్షకులు ఉలిక్కిపడే రేంజ్ లో ఈ సినిమాలో ఒక ట్విస్ట్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా కోసం నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

Also Read : దేవర 2 ఉందా లేదా? ఇదిగో క్లారిటీ!