Shreyas Iyer RJ Mahvash: స్పోర్ట్స్ వర్గాల్లో మరీ ముఖ్యంగా క్రికెట్ వర్గాల్లో కొన్ని ప్రచారాలకు ఎటువంటి మసాల అవసరం లేదు. ఇన్సైడ్ కంటెంట్ కూడా అవసరం లేదు. జస్ట్ ఫోటోలు చాలు ఏం జరుగుతుందో చెప్పడానికి.. అలాంటిది ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఫోటో స్థానిక మీడియాను దాటి జాతీయ మీడియాలోకి వెళ్లింది. జాతీయ మీడియా పుంఖాను పుంఖాలుగా కథనాలను ప్రసారం చేస్తోంది. ఇంతకీ ఆ ఫోటో ఏమిటి? అందులో ఉన్నది ఎవరు? ఇంతకీ ఏం జరుగుతోంది.. చదివేయండి ఈ కథనం..
Also Read: పులివెందుల్లో ఓటమి అంచుల్లో వైఎస్.. చంద్రబాబు రంగంలోకి దిగారు.. ఆ తర్వాత ఏమైందంటే?
ఇటీవల యజువేంద్ర చాహల్ అతడి సతీమణి ధనశ్రీ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ధనశ్రీ – చాహల్ చాలా రోజులపాటు ప్రేమించుకున్న తర్వాత.. వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత వారిద్దరు అన్యోన్యంగానే ఉన్నారు. తమ దాంపత్య జీవితాన్ని ఆనందంగా గడిపారు. ఇంతలో ఏమైందో తెలియదు విడివిడిగా ఉండడం మొదలుపెట్టారు. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. వీరి విడాకులకు శ్రేయస్ అయ్యర్ కూడా కారణమని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. అయితే తమ విడాకులకు ఇదీ కారణమని అధికారికంగా అటు చాహల్, ఇటు ధనశ్రీ బయటికి చెప్పలేదు.. కాకపోతే ధనశ్రీ తో అయ్యర్ కలిసి ఉన్న ఫోటోలను అప్పట్లో విపరీతంగా ట్రోల్ చేశారు.
ధన శ్రీ తో విడాకుల తర్వాత చాహల్ ఆర్జే మహ్వేష్ తో సన్నిహితంగా ఉండడం మొదలుపెట్టాడు.. ఇటీవల ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్స్ జరిగినప్పుడు ఆమెతో కలిసి దుబాయ్ వెళ్లిపోయాడు. ఆమెతో జంటగా మ్యాచ్ కూడా చూశాడు. ఐపీఎల్ లో చాహల్ అద్భుతమైన ప్రదర్శన చేసినప్పుడు మహ్వేష్ ఆ సందర్భాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ఎంత గొప్ప బౌలర్ అంటూ కితాబిచ్చింది. ప్రస్తుతం వారిద్దరూ చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ మహేష్ తో కలిసి అయ్యర్ ఇటీవల కనిపించాడు. మహ్వేష్ వెస్ట్రన్ వేర్ లో దర్శనమిచ్చింది. “అప్పుడు ధనశ్రీ తో ఇప్పుడు మహ్వేష్ తో ఫోటోలు దిగావ్. నీ వాలకం చూస్తుంటే ఫోటోలతోనే ఆగిపోయే రకం కాదు.. చాహల్ ను ఇలా తగులుకున్నావ్ ఏంట్రా” అంటూ సోషల్ మీడియాలో అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు..మరో వైపు ధనశ్రీ, మహ్వేష్ తో అయ్యర్ కు స్నేహం మాత్రమే ఉందని.. అంతకుమించి ఏమీ లేదని అతని సన్నిహితులు అంటున్నారు.