Zee Telugu Vs Gemini: ఒకప్పుడు ఈటీవీ, జెమిని మధ్య విపరీతమైన పోటీ ఉండేది. అప్పట్లో ఓటీటీ లు లేవు కాబట్టి.. కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేయడంలో.. కొత్త కొత్త ధారావాహికలను టెలికాస్ట్ చేయడంలో ఈ రెండు చానల్స్ పోటీపడేవి. చానల్స్ లో ఈటీవీ ని కొట్టే స్థాయి అప్పుడు, ఇప్పుడు జెమినీ కి లేదు. అలాగని ఈటీవీలో వచ్చే ధారావాహికలు గొప్పగా ఉన్నాయని కాదు. ఇప్పుడు ఈటీవీలో సుమన్ రోజులు కాదు. ఒకప్పటి అంతరంగాలు రోజులు అంతకంటే కావు. ఏదో నడుస్తోంది అంటే.. నడుస్తోంది అంతే.. జెమిని కూడా రోజురోజుకు క్రియేటివిటీని తగ్గించుకొని.. చివరికి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంటున్నది. కొన్ని సందర్భాలలో ఐదో స్థానానికి కూడా వెళ్తోంది. జెమినిని ఈరోజుకు బతికిస్తున్నవి ఆ సినిమాలు మాత్రమే.
Also Read: పులివెందుల్లో ఓటమి అంచుల్లో వైఎస్.. చంద్రబాబు రంగంలోకి దిగారు.. ఆ తర్వాత ఏమైందంటే?
కళానిధి మారన్ తమిళంలో దున్నేస్తున్నప్పటికీ.. తెలుగులో మాత్రం ఆ స్థాయికి చేరుకోలేకపోతున్నాడు. బహుశా తెలుగు అనేది అతనికి ఒక ఆప్షన్ మాత్రమే కావచ్చు.చాలా సంవత్సరాలుగా స్టార్ మా మొదటి స్థానంలో కొనసాగుతోంది. దానికి తగ్గట్టుగా సీరియల్స్ కూడా రూపొందిస్తూ తిరుగులేని మార్కెట్ సొంతం చేసుకుంటున్నది. జీ తెలుగు కూడా రెండో స్థానంలో ఉంది. కొన్ని సీరియల్స్ జీతెలుగులో తిరుగులేని స్థానంలో నిలబెడుతున్నాయి. సినిమాలు కూడా జీతెలుగు కాస్తలో కాస్త రేటింగ్స్ తెచ్చిపెడుతున్నాయి. నవ్యత విషయంలో.. మార్కెటింగ్ విషయంలో జెమిని కిందా మీదా పడుతోంది. ఇదే క్రమంలో తన స్థాయిని పెంచుకోవడానికి.. ఏకంగా జీ తెలుగు స్థాయికి రావడానికి జెమిని అడ్డదారులు తొక్కుతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఆదివారం నాటి సినిమాల విషయంలో జెమిని తన సోషల్ మీడియా అకౌంట్లో చేసిన పోస్ట్ అలానే ఉంది.
ఉదయం 9 గంటలకు డార్లింగ్, మధ్యాహ్నం 12 గంటలకు జైలర్, మధ్యాహ్నం మూడు గంటలకు ఊపిరి, సాయంత్రం 6 గంటలకు సంక్రాంతి, 9:30కు పైసా వసూల్ సినిమాలను ప్రసారం చేస్తామని జెమినీ ఆ పోస్టులో పేర్కొంది. అయితే సంక్రాంతి సినిమాకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా పోస్టర్ వేసింది. వాస్తవానికి సంక్రాంతికి వస్తున్నాం సినిమా రైట్స్ ను జీతెలుగు కొనుగోలు చేసింది. ఆల్రెడీ మూడుసార్లు టెలికాస్ట్ కూడా చేసింది. అయితే సంక్రాంతి సినిమా రైట్స్ ఇప్పటికి జెమినీ దగ్గరే ఉన్నాయి. సంక్రాంతి సినిమాను పుష్కరకాలంగా జెమిని ప్రసారం చేస్తూనే ఉంది. సంక్రాంతి సినిమాను టెలికాస్ట్ చేస్తున్నప్పుడు.. ఆ సినిమాకు సంబంధించి పోస్టర్ వేస్తే సరిపోయేది. అలా కాకుండాస రీసెంట్ వెంకటేష్ బ్లాక్ బస్టర్ సినిమా పోస్టర్ వేసి జెమినీ టీవీ తన బుద్ధిని ప్రదర్శించుకుంది.. మరి ఈ పోస్టర్ జీ తెలుగు నిర్వాహకులు దాకా వెళ్ళిందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ తెలిస్తే జీ తెలుగు ఎటువంటి చర్యలు తీసుకుంటుందో కూడా చూడాల్సి ఉంది..