Abhishek Sharma : ఎడమ చేతివాటంతో బ్యాటింగ్ చేసే అభిషేక్ శర్మ తనదైన రోజు విలయాన్ని సృష్టిస్తాడు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. తన గురువు యువరాజ్ సింగ్ కావడంతో.. అతని బ్యాటింగ్ మీద యువరాజ్ ప్రభావం కచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. యువరాజ్ ఆధ్వర్యంలోనే అభిషేక్ శర్మ ఇంతటి ఆటగాడు అయ్యాడు.. మామూలుగా అయితే ఏ బ్యాటర్ అయినా సరే కాస్త బౌలర్లపై కనికరం చూపుతాడు. కానీ అభిషేక్ శర్మ కు అలాంటి కనికరం ఉండదు. తనదైన రోజు బౌలర్లకు నిద్రలేని రాత్రులను పరిచయం చేస్తాడు. బంతిని నలుమూలల పరుగులు పెట్టిస్తాడు. శనివారం నాడు జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఎనిమిది వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసిందంటే దానికి కారణం అభిషేక్ శర్మనే.. 55 బాల్స్ ఫేజ్ చేసి 14 ఫోర్లు, పది సిక్సర్ల సహాయంతో 141 రన్స్ స్కోర్ చేశాడు.. 40 బాల్స్ లోనే సెంచరీ చేసి అరుదైన రికార్డు కూడా నెలకొల్పాడు. మొత్తానికి ఉప్పల్ మైదానాన్ని తన బ్యాటింగ్ స్టైల్ తో శివాలూగేలాగా చేశాడు.
Also Read : ఐశ్వర్య నుంచి ఫోన్ వస్తే అభిషేక్ కి చెమటలు పడతాయా..?

జేబులో పెట్టుకుని వచ్చాడు
సాధారణంగా ఏ ఆటగాడైనా సరే బలంగా ఆడాలని అనుకుంటాడు. జట్టు కోసం దృఢంగా నిలబడాలి అనుకుంటాడు. కానీ మైదానంలో అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండవు. బంతులు ఎలా వస్తాయి తెలియదు. బౌలర్లు ఎలా వేస్తారో తెలియదు. అలాంటప్పుడు ప్రతిబంతిని కాచుకొని ఉండాలి. జాగ్రత్తగా ఆడుతూ ఉండాలి. కానీ ఎక్కడ ఒకచోట తప్పు జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత దానికి బ్యాటర్ తలవంచాల్సి ఉంటుంది. శనివారం అభిషేక్ శర్మ. మైదానంలోకి దిగేముందే అతడు గట్టిగా ఫిక్స్ అయ్యాడు. అంతేకాదు ఎలాగైనా సెంచరీ చేస్తానని బలంగా నిర్ణయించుకున్నాడు. దానికి తగ్గట్టుగానే ఒక కాగితం మీద రాసుకుని వచ్చాడు. సెంచరీ చేసిన తర్వాత తన జేబులో ఉన్న కాగితాన్ని బయటకి చూపించాడు. ఆ కాగితంలో ఈరోజు ఎలాగైనా సెంచరీ చేస్తానని ఉంది.. దానికి తగ్గట్టుగానే అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడాడు. అనితర సాధ్యమైన ఆట తీరు చూపించాడు. ఏ బౌలర్ పై కనికరం చూపించలేదు. జాలిని కూడా ప్రదర్శించలేదు. ఒకటే కొట్టుడు.. ఒకటే బాదుడు. అందువల్లే హైదరాబాద్ అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో సంజీవని ఇలాంటి విజయాన్ని సాధించి.. తన ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోయి.. పాయింట్లు పట్టికలో అధమ స్థానంలో ఉన్న హైదరాబాద్.. పంజాబ్ జట్టుతో తలపడిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో గెలవడం ద్వారా.. పాయింట్లు పట్టికలో తన స్థానాన్ని కాస్త మెరుగుపరుచుకుంది.
Also Read : నువ్వు బ్యాట్ తో తాండవం చేస్తుంటే.. మా కావ్య పాప ఎగిరి గంతేస్తోంది.. నువ్విలాగే ఆడు స్వామి
