https://oktelugu.com/

Ram Charan : రామ్ చరణ్ – బుచ్చి బాబు చిత్రంలో ఇంతమంది పాన్ ఇండియన్ హీరోలు ఉన్నారా..? ప్లానింగ్ మాములుగా లేదుగా!

రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శివరాజ్ కుమార్ రామ్ చరణ్ కి గురువు పాత్రలో కనిపించబోతున్నాడు. యాదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తుంది. అక్టోబర్ లో షూటింగ్ ని ప్రారంభించి, వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

Written By:
  • NARESH
  • , Updated On : September 14, 2024 / 06:02 PM IST

    So many pan-Indian heroes in Ram Charan - Buchi Babu movie

    Follow us on

    Ram Charan – Buchi Babu : #RRR వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ రేంజ్ ఎలా మారిపోయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన సినిమా విడుదలైతే ఇక కేవలం టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు, బాలీవుడ్, కోలీవుడ్ మరియు విదేశీయులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు. ఆ స్థాయి మార్కెట్ ఆయనకీ ఏర్పడింది. అందుకే ఆయనని అభిమానులు గ్లోబల్ స్టార్ అని పిలుస్తుంటారు. #RRR తర్వాత ఆయన సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో కలిసి ‘గేమ్ చేంజర్’ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్లాన్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ జరిగి ఉండుంటే గత ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ మధ్యలో శంకర్ ఇండియన్ 2 కి షిఫ్ట్ అవ్వడం వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలను జరుపుకున్న ఈ చిత్రం ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

    అయితే ఈ సినిమా నుండి ఇప్పటి వరకు టీజర్ రాకపోవడం పై అభిమానుల్లో తీవ్రమైన అసహనం ఏర్పడిన సంగతి తెలిసిందే. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాలోని ఒక పోస్టర్ ని విడుదల చేసి అతి త్వరలోనే రెండవ లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటి వరకు దాని గురించి మళ్ళీ ఎలాంటి ఊసు లేదు. ఈ సినిమా పరిస్థితి ఇలా ఉంటే, మరోపక్క రామ్ చరణ్ బుచ్చి బాబు కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతుంది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నెల నుండి ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్స్ లో ఒకరైన శివ రాజ్ కుమార్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అక్టోబర్ నుండి ఆయన తన పార్ట్ షూటింగ్ కి సంబంధించిన డేట్స్ ని కేటాయించాడు. ఈ సినిమాలో కేవలం శివ రాజ్ కుమార్ మాత్రమే కాదు, హీరో సూర్య, విజయ్ సేతుపతి వంటి వారు కూడా కీలక పాత్రలలో కనిపించబోతున్నారట. హీరోయిన్ గా జాన్వీ కపూర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

    ఎప్పుడైతే సూర్య ఈ సినిమాలోకి ఎంటర్ అయ్యాడో, ఈ చిత్రంపై సౌత్ ఇండియా లో బజ్ తారాస్థాయికి చేరుకుంది. తమిళం లో కూడా ఈ చిత్రానికి ఓపెనింగ్స్ అదిరిపోతాయి, టాక్ బాగుంటే ఫుల్ రన్ కూడా దుమ్ములేచిపోతుంది. ఇంత మంది పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ ఉన్న ఈ సినిమా, కల్కి చిత్రం తర్వాత పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ చిత్రంగా పెరిగిణించొచ్చు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శివరాజ్ కుమార్ రామ్ చరణ్ కి గురువు పాత్రలో కనిపించబోతున్నాడు. యాదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తుంది. అక్టోబర్ లో షూటింగ్ ని ప్రారంభించి, వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.