Shikhar Dhawan: సెలబ్రిటీలకు అలవాటే.. మనసుకు నచ్చితే ప్రేమించడం.. ఆ ప్రేమ చిక్కబడితే పెళ్లి చేసుకోవడం.. విభేదాలు ఎదురైతే విడిపోవడం సర్వసాధారణం.. సెలబ్రిటీలలో మరీ ముఖ్యంగా క్రికెటర్లు విడాకులు తీసుకోవడం ఇదేం కొత్తకాదు. ఇప్పుడే మొదలైన సంప్రదాయం కాదు.
Also Read: సాయి సుదర్శన్.. మరో ఎబి డివిలియర్స్ అవుతాడా?
కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా వినియోగం విపరీతంగా ఉంది.. మీడియా రీచ్ ఎక్కువైంది. అందువల్లే క్రికెటర్లకు సంబంధించిన ప్రతి విషయం కూడా ట్రెండింగ్ అవుతున్నది. సహజంగా ఇలాంటి వార్తలను చదవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు.. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. నిప్పు లేనిదే పొగరాదు కాబట్టి.. సెలబ్రిటీల విడాకుల విషయంలో ముందే మీడియాకు ఉప్పందుతుంది. ఆ తర్వాత జరగాల్సింది జరిగిపోతుంది. విడాకుల నుంచి మరో కొత్త తోడు వెతుక్కునే దాకా.. సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి విషయంలో మీడియాకు కావలసినంత మసాలా లభిస్తుంది.. కొంతమంది ఇలాంటి వాటిని ఇష్టపడకపోవచ్చు. కానీ మెజారిటీ ప్రజలు మాత్రం ఇలాంటి వాటిని చూస్తుంటారు. ఎందుకంటే వాళ్ల జీవితం కంటే పక్కోడి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడమే ఇంట్రెస్ట్ కాబట్టి.
ఇప్పుడు శిఖర్ ధావన్ వంతు
విడాకులు తీసుకున్నంత మాత్రాన ప్రేమలో పడకూడదనేది లేదు.. పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలని నిబంధన ఏమీ లేదు. అసలు ప్రేమకు వయసుతో సంబంధం లేదు. ఇప్పుడు దీనిని శిఖర్ ధావన్ మరోసారి నిరూపించాడు. ఆయేషాముఖర్జీతో విడాకుల తర్వాత.. కొంతకాలం శిఖర్ ధావన్ ఒంటరిగానే ఉండిపోయాడు. ఆ మధ్య అతడి పై రకరకాల విమర్శలు వచ్చాయి.. చివరికి టీమిండియా ఉమెన్స్ లెజెండ్రీ క్రికెటర్ మిథాలీ రాజ్ తో కూడా అతడికి రిలేషన్ ఉందని పుకార్లు వినిపించాయి. చివరికి అవన్నీ ఉత్తి కబుర్లేనని తేలిపోయింది. ఇప్పుడు ఇక తాజాగా శిఖర్ ధావన్ సోఫి షైన్ అనే ఐర్లాండ్ యువతితో రిలేషన్ లో ఉన్నాడు. పేరుకు తగ్గట్టుగానే ఆమె మెరుస్తూనే ఉంటుంది.. ఎత్తుకు తగ్గట్టు అందంతో ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఈమెది ఐర్లాండ్. అక్కడ ఓ ప్రోడక్ట్ కంపెనీకి కన్సల్టెంట్ గా పనిచేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఈమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు తన సంబంధించిన అప్డేట్స్ ను అందులో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక ఇటీవల ఐసీసీ నిర్వహించిన ఛాంపియన్ ట్రోఫీలో శిఖర్ ధావన్, షైన్ జంటగా కనిపించారు. మొదట్లో వీరిద్దరి గురించి మీడియా అంతగా పట్టించుకోలేదు. అయితే ఆ ట్రోఫీలో వీరిద్దరూ అత్యంత చనువుగా కనిపించడంతో మీడియా ఆరా తీసింది. ఆ తర్వాత లోతుల్లోకి వెళ్ళింది. వీరిద్దరి మధ్య జరుగుతున్న అసలు వ్యవహారం వెలుగు చూసింది. ఆ తర్వాత మీడియా సమావేశంలో శిఖర్ ధావన్ అసలు విషయాన్ని చెప్పేశాడు. మొత్తంగా మేమిద్దరం రిలేషన్ లో ఉన్నామని ఒప్పుకున్నాడు. ఇప్పటికే హార్దిక్ పాండ్యా జాస్మిన్ తో రిలేషన్ కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది అతని భార్య నటాషా తో విడాకులు తీసుకున్నాడు.. ఇక యజువెంద్ర చాహల్ కూడా తన భార్య ధనశ్రీ తో విడాకులు తీసుకున్నాడు. అతడు ఆర్జె మహ్వేష్ తో రిలేషన్ లో ఉన్నాడు. ఇప్పుడు ఈ జాబితాలో శిఖర్ ధావన్ కూడా చేరిపోయాడు. బహుశా స్వల్ప కాలంలోనే శిఖర్ ధావన్ షైన్ ను వివాహం చేసుకునే అవకాశం ఉందని స్పోర్ట్స్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.