Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh Censor Talk: 'ఉస్తాద్ భగత్ సింగ్' సెన్సార్ కార్యక్రమాలు పూర్తి.. టాక్...

Ustaad Bhagat Singh Censor Talk: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి.. టాక్ ఏంటంటే!

Ustaad Bhagat Singh Censor Talk: మరో 9 రోజుల్లో విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘(Ustaad Bhagat Singh) సెన్సార్ కార్యక్రమాలు నేడు కాసేపటి క్రితమే పూర్తి అయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు క్లీన్ U/A సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు తిట్లేమార్చమని అభ్యంతరం వ్యక్తం చేస్తారేమో అని అంతా అనుకున్నారు. అందుకు కారణం స్వాతంత్ర సమరయోధుడి టైటిల్ పెట్టడం వల్లే. ఈమధ్య […]

Ustaad Bhagat Singh Censor Talk: మరో 9 రోజుల్లో విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘(Ustaad Bhagat Singh) సెన్సార్ కార్యక్రమాలు నేడు కాసేపటి క్రితమే పూర్తి అయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు క్లీన్ U/A సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు తిట్లేమార్చమని అభ్యంతరం వ్యక్తం చేస్తారేమో అని అంతా అనుకున్నారు. అందుకు కారణం స్వాతంత్ర సమరయోధుడి టైటిల్ పెట్టడం వల్లే. ఈమధ్య కాలంలో అనేక సినిమాలకు ఇలాగే టైటిల్ మార్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ చిత్రానికి భయపడినట్టు ఏది జరగలేదు. పవన్ కళ్యాణ్ గత చిత్రానికి A సర్టిఫికేట్ రావడం వల్ల అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. కారణం మల్టీ ప్లెక్స్ థియేటర్స్ లో ఏజ్ లిమిట్ ఉంటుంది కాబట్టి. కానీ ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ చిత్రానికి U/A ఇవ్వడం తో ఏజ్ లిమిట్ లేకుండా ప్రతీ ఒక్కరు ఈ సినిమాని చూడొచ్చు కాబట్టి ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

ఇక టాక్ విషయానికి వస్తే ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ ని చాలా గొప్పగా చూపించాడట డైరెక్టర్ హరీష్ శంకర్. ఆయనకు సంబంధించిన ఎలివేషన్ సన్నివేశాలన్నీ బాగా పేలినట్టు తెలుస్తోంది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఎనర్జీ తో ఈ సినిమాలో నటించాడని, ఆయన మార్క్ కామెడీ టైమింగ్, సింగిల్ లైన్ డైలాగ్స్ , యాక్షన్ సన్నివేశాలు బాగా పేలాయని అంటున్నారు. అదే కనుక జరిగితే కచ్చితంగా ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డ్స్ ని బద్దలు కొడుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. చాలా మంది ఈ చిత్రాన్ని తమిళంలో సూపర్ హిట్ గా నిల్చిన ‘తేరి ‘ కి రీమేక్ అంటూ ప్రచారం చేశారు, కానీ సెన్సార్ రివ్యూ అయ్యాక అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.

Also Read: ‘వారణాసి’ లో ‘నాటు నాటు ‘ రేంజ్ సాంగ్..? ఫ్యాన్స్ వెర్రిక్కిపోయే అప్డేట్ చెప్పిన కొరియోగ్రాఫర్!

అయితే ఈమధ్య కాలం లో ఇలాగే అనేక సినిమాలకు సెన్సార్ బోర్డు నుండి పాజిటివ్ టాక్ రావడం , కానీ విడుదల అయ్యాక అంచనాలు తప్పడం వంటివి మనమంతా చూసాము. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఆ కోవకు చెందిన సినిమానేనా అనే భయం కాస్త అభిమానుల్లో ఉన్నది. ఈ సినిమాకు ఉన్న అతి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే రన్ టైం. కేవలం 2 గంటల 29 నిమిషాల నిడివి మాత్రమే ఉంటుందట. అభిమానులు , ప్రేక్షకులు బోర్ ఫీల్ అవ్వరు, యావరేజ్ రేంజ్ లో తీసినా పాజిటివ్ టాక్ వస్తుంది అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం నుండి ‘కాలరే ఎత్తరా’ పాటకు సంబంధించిన ప్రోమో వీడియో ని నేడు విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ పాటలో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ అదరగొట్టినట్టు సెన్సార్ నుండి టాక్ వచ్చింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper