Sai Sudarshan: ఐపీఎల్ ప్రస్తావనకు వస్తే ఇప్పటికి చాలామందికి డివిలియర్స్ కళ్ళ ముందు కనిపిస్తాడు. బెంగళూరు జట్టు ఐపిఎల్ ట్రోఫీ సాధించకపోయినప్పటికీ.. అత్యంత విలువైన జట్టుగా మారడం వెనుక మాత్రం డివిలియర్స్ కచ్చితంగా ఉన్నాడు. అందువల్లే అతడిని తమ చిరస్థాయి ఆటగాడిగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రకటించింది. అతడికి అద్భుతమైన స్థానాన్ని కూడా కట్టబెట్టింది. డివిలియర్స్ తర్వాత ఆ స్థాయిలో ఆడిన ఆటగాడిగా సూర్య కుమార్ యాదవ్ పేరు తెచ్చుకున్నాడు. అతడు టీమిండియా క్రికెట్లో మిస్టర్ 360గా పేరుపొందాడు. ఎలాగైనా బంతిని బౌండరీకి తరలించే విధంగా అతడు బ్యాటింగ్ చేయడంతో.. అతనికంటూ ఒక ప్రత్యేకమైన అభిమాన గణం ఏర్పడింది. ఐపీఎల్ లో అదరగొట్టిన తర్వాత సూర్య కుమార్ యాదవ్ భారత క్రికెట్ జట్టులో స్థానం సంపాదించాడు. ప్రస్తుతం టి20 ఫార్మాట్ లో టీమిండియా కు నాయకత్వం వహిస్తున్నాడు. అంతేకాదు వరుస విజయాలు అందిస్తూ మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా అతడు పేరు తెచ్చుకున్నాడు.. వచ్చే టి ట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియా కు సూర్య కుమార్ యాదవ్ సారథ్యం వహించే అవకాశం ఉంది.
Also Read: 30 ఇన్నింగ్స్ ల తర్వాత వీరికి ఐపీఎల్ అర్థమైంది.. సీన్ కట్ చేస్తే దుమ్ము దుమారమే.
ఇప్పుడు ఇతడి వంతు
ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ జట్టులో సాయి సుదర్శన్ ఆడుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే అతడు డివిలియర్స్ రికార్డును సమం చేశాడు. అహ్మదాబాద్ వేదికగా 2018 – 19 ఐపీఎల్ కాలంలో డివిలియర్స్ వరుసగా 50+ పరుగులు చేశాడు. అయితే ఇప్పటివరకు ఆ రికార్డును ఏ ఆటగాడు కూడా బద్దలు కొట్టలేదు. అయితే ఇప్పుడు ఆ రికార్డును గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సాయి సుదర్శన్ ఆ ఘనతను ఈక్వల్ చేశాడు. 2024 -2025 కాలంలో సాయి సుదర్శన్ అహ్మదాబాద్ వేదికగా వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు. మొత్తంగా డివిలియర్స్ రికార్డును సమం చేశాడు. మరోసారి ఇదే వేదికపై గనక గుజరాత్ జట్టు తలపడితే.. అందులో కూడా సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ చేస్తే.. ఈ ఘనత అందుకున్న తొలి ఆటగాడిగా నిలుస్తాడు. అంతేకాదు ఐపీఎల్ లో ఒకే వేదిక పైన 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన భారత ఆటగాడిగా కూడా రికార్డు సృష్టిస్తాడు. అయితే ఆ రికార్డును సృష్టించడానికి సాయి సుదర్శన్ కు ఎంతో సమయం పట్టకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 18వ సీజన్లో భీకరమైన ఫామ్ లో ఉన్న ఆటగాళ్ల జాబితాలో సాయి సుదర్శన్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. నిన్న కెప్టెన్ గిల్ వెంటనే అవుట్ అయినప్పటికీ.. మిగతా ఆటగాళ్ల నుంచి ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం లభించకపోయినప్పటికీ.. సాయి సుదర్శన్ ఒక్కడే ఆడాడు. రాజస్థాన్ బౌలర్లను తీవ్రంగా ప్రతిఘటిస్తూ.. గుజరాత్ జట్టు భారీ స్కోర్ చేయడంలో సహాయపడ్డాడు.