Mohammed Shami: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ సమీకరణాలు సంక్లిష్టంగా మారిన నేపథ్యంలో.. టీమిండియా అందులోకి ప్రవేశించాలంటే కచ్చితంగా ఆస్ట్రేలియాపై 4-0 గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే భారత జట్టు ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది. కుటుంబ కారణాల వల్ల కెప్టెన్ రోహిత్ శర్మ పెర్త్ లో జరిగే తొలి టెస్ట్ కు దూరం కానున్నాడు. అతడి స్థానంలో బుమ్రా భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. అయితే ఈ ట్రోఫీకి ముందు టీమ్ ఇండియా స్టార్ పేస్ బౌలర్ షమీ సుదీర్ఘకాలం తర్వాత గ్రౌండ్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. కొంతకాలంగా అతడు చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. ఏడాదిపాటు జట్టుకు దూరంగా ఉన్నాడు. ఆ గాయం నుంచి కోలుకోవడానికి లండన్ లో శాస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం అతడు ఫిట్ గా ఉన్నాడు. బుధవారం నుంచి మధ్యప్రదేశ్ తో జరిగే ఐదవ రౌండ్ రంజి మ్యాచ్ లో పశ్చిమ బెంగాల్ జట్టు తరఫున అతడు ఆడనున్నాడు. ఈ విషయాన్ని వెస్ట్ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది.
అప్పుడే దిగాల్సి ఉండేది
కర్ణాటక తో జరిగిన నాలుగో రౌండు రంజి మ్యాచ్ లో శమీ ఎంట్రీ ఇవ్వాల్సి ఉండేది. కానీ అతడు పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని సాధించకపోవడంతో అతడికి అవకాశం లభించలేదు. గాయం నుంచి షమీ కొలుకున్న అనంతరం.. అతడు బెంగాల్ జట్టు తరఫున ఆడేందుకు ఫిట్ గా ఉన్నాడని బీసీసీఐ మెడికల్ టీం పచ్చ జెండా ఊపింది. ఒకవేళ రంజీ ట్రోఫీలో అతడు తన పూర్వపు లయను అందుకుంటే.. ఆస్ట్రేలియా పై తలపడటం పెద్ద కష్టం కాదు. జట్టు అవసరాల దృష్ట్యా సిరీస్ మధ్యలోనైనా అతడు ఆస్ట్రేలియా వెళ్లే అవకాశం లేకపోలేదు. గత ఏడాది నవంబర్లో ఆస్ట్రేలియాతో వన్డే ప్రపంచ కప్ ఫైనల్ జరిగింది. ఆ మ్యాచ్ తర్వాత చీలమండ గాయంతో షమీ టీమిండియా కు దూరమయ్యాడు.. ఆ తర్వాత సర్జరీ కోసం లండన్ వెళ్ళాడు. ఇటీవల జరిగిన న్యూజిలాండ్ సిరీస్ తో షమీ రీయంట్రీ ఇస్తాడని ప్రచారం జరిగింది. అంతకుముందు జరిగిన టి20 వరల్డ్ కప్ లోనూ అతడు ఆడతాడని అందరు అనుకున్నారు. కానీ అవేవీ జరగలేదు. కొంతకాలం నుంచి శని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందాడు. సామర్ధ్య పరీక్షలో కూడా విజయం సాధించాడు. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో.. దేశవాళి క్రికెట్ సత్తా చాటిన తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ప్రవేశిస్తానని పేర్కొన్నాడు. రంజి క్రికెట్ లో సత్తా చాటిన అనంతరం.. ఆస్ట్రేలియాలో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఎంట్రీ ఇస్తానని పేర్కొన్నాడు.