https://oktelugu.com/

Jagan: కూటమి సర్కార్ ను ఢిల్లీకి లాగిన జగన్!

జాతీయస్థాయిలో కూటమి సర్కార్ ఆగడాలను బయటపెట్టాలని జగన్ ప్రయత్నించారు. అందులో భాగంగా సోషల్ మీడియా ప్రతినిధుల అరెస్టుపై ఏకంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

Written By:
  • Dharma
  • , Updated On : November 12, 2024 6:02 pm
    YS Jagan

    YS Jagan

    Follow us on

    Jagan: ఏపీవ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధుల అరెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఏపీ పోలీసులు దూకుడుగా ఉన్నారు. సైబర్ నేరాలకు సంబంధించి కఠిన సెక్షన్లు అమలు చేస్తున్నారు. లీగల్ సేవల కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేసింది వైసిపి. అయితే పెద్దగా అది వర్కౌట్ కావడం లేదు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా ప్రతినిధులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.తెలుగు రాష్ట్రాల్లో వెతికి మరి పోలీసులు వారిని పట్టుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లింది వైసిపి.పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టు అంశాన్ని వైసీపీ నాయకులుజాతీయ మానవ హక్కుల కమిషన్ కు విన్నవించారు. ఏపీలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కమిషన్ తాత్కాలిక చైర్ పర్సన్ విజయభారతికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడ రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబురావు, ఎంపీ తనుజారాణి తదితరులు మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ ను కలిసిన వారిలో ఉన్నారు. అధినేత జగన్ ఆదేశాల మేరకు కలిసినట్లు చెప్పుకొచ్చారు.

    * జాతీయస్థాయిలో అండలేక
    అందుకే వైసిపికి ఇప్పుడు వేరే మార్గం లేదు.జాతీయస్థాయిలో ఏ కూటమి అండలేదు.మొన్నటివరకు అన్ని విధాల సహకరించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు టిడిపికి దగ్గర అయింది.జాతీయస్థాయిలో తెలుగుదేశం పార్టీ అండదండలు ఇప్పుడు బిజెపికి అవసరం.పైగా రాష్ట్రంలోఓటమి ప్రభుత్వంలో బిజెపి సైతం భాగస్వామి.అందుకే వైసీపీకి ఎటు పాలు పోవడం లేదు.అందుకే రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై ఆధార పడాల్సి వస్తోంది.పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పాలంటే కచ్చితంగా పోరాటం చేయాల్సి ఉంది. ఇప్పుడు వైసీపీ చేస్తోంది అదే. మొన్నటికి మొన్న హైకోర్టును ఆశ్రయించింది వైసిపి. హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అయితే అవి ఉపశమనం కలిగించలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా అరెస్టులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలోనే వైసిపి జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది.

    * హైకోర్టు ఆదేశాలు
    ఈ అరెస్టుల విషయంలో హైకోర్టు స్పందించింది. బాధితుల కుటుంబ సభ్యులు హైకోర్టు తలుపు తట్టారు. విచారణ సమయంలో కనీసం ఆహారం ఇవ్వడం లేదని.. చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పడంతో కోర్టు స్పందించింది. విచారణకు సంబంధించి సీసీ పుటేజీలు ఇవ్వాలని కోరింది. అంతకుమించి ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో వైసిపి లీగల్ టీం నిస్సహాయత వ్యక్తం చేసింది. అందుకే వైసిపి నేతలు జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.