Pawan Kalyan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట ఆయన చేయబోయే సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయి. తద్వారా ఆ సినిమాలతో ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకోబోతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉన్నాడు. అయినప్పటికి ఆయన మూడు సినిమాలను సెట్స్ మీద ఉంచాడు. మరి ఆ సినిమాలు ఎప్పుడు పూర్తి చేస్తాడు. ఎప్పుడు రిలీజ్ చేస్తాడు అనే విషయాల మీదనే సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. మరి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ సినిమాలు సూపర్ సక్సెస్ అయినా కాకపోయినా కూడా పవన్ కళ్యాణ్ తన అభిమానుల కోసం సినిమాలు చేస్తాడు అని కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.
Also Read : హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ఇంటికెళ్లిన అల్లు అర్జున్..గంటకు పైగా చర్చ!
ఇక ఇలాంటి క్రమంలోనే ఈ మూడు సినిమాలు తర్వాత త్రివిక్రమ్ (Trivikram) డైరెక్షన్ లో ఒక భారీ సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించి అప్పటినుంచి సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాటుగా కొంతవరకు సమాచారమైతే అందుతుంది. ప్రస్తుతం ఆయన అనుకున్నట్టుగానే త్రివిక్రమ్ డైరెక్షన్ లో మరో సినిమా చేయబోతున్నాడా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి.
ఇప్పుడు త్రివిక్రమ్ ధనుష్ తో గాని, సూర్య తో గానీ ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. మరి ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తాడా లేదంటే అల్లు అర్జున్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇప్పటికే పవన్ కళ్యాణ్ భారీ సక్సెస్ సాధించి సాధించి చాలా సంవత్సరాలవుతుంది.
ఒక రకంగా ఆయన సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేయాలని పెద్దగా లేకపోయినప్పటికి తన అభిమానులను నిరాశ పరచకూడదు అనే ఉద్దేశంతోనే ఇటు సినిమాలు చేస్తూ అటు పాలిటిక్స్ లో కూడా చాలా బిజీగా కొనసాగుతున్నాడు. మరి ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ రెండు పడవల మీద సక్సెస్ ఫుల్ గా ప్రయాణం చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
Also Read : తిరుమలలో 17 లక్షల రూపాయలతో అన్నదానం చేసిన పవన్ కళ్యాణ్ సతీమణి!