https://oktelugu.com/

KKR – IPL : గౌతమ్ గంభీర్ వెళ్లిపోయిన తర్వాత.. కోల్ కతా జట్టుకు కొత్త మెంటార్.. మాజీ ఆల్ రౌండర్ ను నియమించుకున్న షారుక్ ఖాన్..

ఐపీఎల్ 2024 సీజన్ లో కోల్ కతా జట్టు విజేతగా నిలిచింది. ఆ జట్టు విజయం సాధించడంలో మెంటార్ గౌతమ్ గంభీర్ ప్రముఖ పాత్ర పోషించాడు. 2014 తర్వాత.. ఆ జట్టు మరోసారి ట్రోఫీ దక్కించుకోవడంలో ముఖ్య భూమిక వహించాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 9, 2024 / 09:30 PM IST

    KKR - IPL

    Follow us on

    KKR – IPL :  ఐపీఎల్ -2024 సీజన్ లో కోల్ కతాను విజేతగా ఆవిర్భవించేలా చేసిన నేపథ్యంలో గౌతమ్ గంభీర్ ను బీసీసీఐ జనరల్ సెక్రెటరీ జై షా టీమిండియా హెడ్ కోచ్ గా పదవి బాధ్యతలు చేపట్టాలని ఆఫర్ ఇచ్చారు. దీంతో గౌతమ్ గంభీర్ కోల్ మెంటార్ పదవిని కాదనుకొని.. టీమిడియా హెడ్ కోచ్ గా వచ్చాడు. దీంతో కోల్ కతా జట్టు లో మెంటార్ పోస్ట్ ఖాళీగా ఉంది. అంతేకాదు అసిస్టెంట్ కోచ్ లు అభిషేక నాయక్, రైస్ టెన్ దసకటే కూడా టీమిండియా తో తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇక ప్రస్తుతం ఖాళీగా ఉన్న మెంటార్ పోస్టును కోల్ కతా జట్టు యజమాని షారుక్ ఖాన్ ఓ మాజీ ఆల్ రౌండర్ తో భర్తీ చేశాడు. ఇప్పటికే ఇతర జట్లైన లక్నో, రాజస్థాన్ కొత్త మెంటార్, కోచ్ ను ప్రకటించాయి. కోల్ కతా కూడా కొత్త మెంటార్ ను నియమించుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మొన్నటిదాకా రికీ పాంటింగ్, కుమార సంగక్కర పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు మరో మాజీ ఆల్ రౌండర్ పేరు స్పోర్ట్స్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

    ఒకప్పుడు జట్టులో సభ్యుడు

    కోల్ కతా జట్టులో ఒకప్పుడు జాక్వెస్ కలిస్ ఆడాడు. ఇప్పుడు అతడిని మెంటార్ గా నియమించుకోవాలని భావిస్తోంది.. 2015లో ప్రధాన కోచ్ గా, బ్యాటింగ్ కన్సల్టెంట్ గా కోల్ కతా జట్టుకు వ్యవహరించా. గంభీర్ సారధ్యంలో 2012, 2014లో కోల్ కతా ఐపీఎల్ టైటిల్స్ సొంతం చేసుకుంది. అప్పుడు కలిస్ కూడా ఆ జట్టులో ఉన్నాడు. మరోవైపు నిన్నా మొన్నటి దాకా ఢిల్లీ కోచ్ గా పనిచేసిన పాంటింగ్ పేరు కూడా పరిశీలించినట్లు తెలుస్తోంది. మరోవైపు కోల్ కతా కు మెంటార్ గా రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ గా కొనసాగుతున్న కుమార సంగక్కర కూడా ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. షారుక్ ఖాన్ మాత్రం కలిస్ వైపు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.

    చర్చలు పూర్తి

    ఇప్పటికే ఒక దశ చర్చలు పూర్తయ్యాయని.. త్వరలోనే అతడి నియామకాన్ని అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. దక్షిణాఫ్రికా జట్టు ఆల్రౌండర్ గా కలిస్ కు పేరుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో కలిస్ కు తిరుగులేదు. అతడి ఆధ్వర్యంలో కోల్ కతా జట్టు మరోసారి విజేతగా ఆవిర్భవిస్తుందని షారుఖ్ ఖాన్ బలంగా నమ్ముతున్నాడు. అందువల్లే అతడిని మెంటార్ గా తీసుకోవాలని ఒక బలమైన నిర్ణయానికి వచ్చాడు. బహుశా అతడి అధికారిక ప్రకటన రెండు మూడు రోజుల్లో వెలువడుతుందని కోల్ కతా జట్టు వర్గాలు చెబుతున్నాయి.