https://oktelugu.com/

Bigg Boss 8 Telugu : అత్యధిక శాతం మంది జనాలు సెప్టెంబర్ నెలలోనే పుడుతారట..శేఖర్ బాషా వదిలిన మరో ఆణిముత్యం!

బిగ్ బాస్ హౌస్ లో ఇతను పేల్చే జోకులకు కంటెస్టెంట్స్ మెంటలెక్కిపోతున్నారు. నాగార్జున కూడా ఈయన జోకులకు నిన్న పగలబడి నవ్విన సందర్భం మన అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఆ స్థాయి ఎంటర్టైన్మెంట్ ని పండించాడు ఆయన. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టినప్పటి నుండి నేటి వరకు ఈయన వదిలినన్ని పంచులు, సినిమాల్లో ఏ కామెడీ డైరెక్టర్ కూడా వదిలి ఉండదు.

Written By:
  • Vicky
  • , Updated On : September 9, 2024 / 09:10 PM IST

    Shekar Bhasha

    Follow us on

    Bigg Boss 8 Telugu :  బిగ్ బాస్ టీం ఈసారి సెలెక్షన్స్ చాలా విన్నూతనమైన రీతిలో చేసింది అనే చెప్పాలి. పెద్ద పెద్ద సెలెబ్రెటీలకు లక్షల రూపాయిల రెమ్యూనరేషన్స్ ఇచ్చి మేపడం కంటే, టాలెంట్ ఉన్న వారిని ప్రోత్సహిస్తే టీఆర్ఫీ రేటింగ్స్ అదిరిపోతాయని భావించి, సరిగ్గా అలాంటి వారినే హౌస్ లోకి దించింది. ఫలితంగా మొదటి వారం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ అయ్యారు. అయితే ఆడియన్స్ హౌస్ లో అందరి కంటే శేఖర్ బాషా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టకముందు ఆయన రాజ్ తరుణ్ – లావణ్య వ్యవహారం లో తలదూర్చి రాజ్ తరుణ్ తరుపున నిలబడి ఎంతో ఫైర్ తో మాట్లాడిన శేఖర్ భాషలో ఇంత కామెడీ టైమింగ్ ఉందా అని ఆడియన్స్ ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు.

    బిగ్ బాస్ హౌస్ లో ఇతను పేల్చే జోకులకు కంటెస్టెంట్స్ మెంటలెక్కిపోతున్నారు. నాగార్జున కూడా ఈయన జోకులకు నిన్న పగలబడి నవ్విన సందర్భం మన అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఆ స్థాయి ఎంటర్టైన్మెంట్ ని పండించాడు ఆయన. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టినప్పటి నుండి నేటి వరకు ఈయన వదిలినన్ని పంచులు, సినిమాల్లో ఏ కామెడీ డైరెక్టర్ కూడా వదిలి ఉండదు. ఆ జోక్స్ వెనుక అర్థాన్ని తెలిసిన తర్వాత అది విన్న వారికి ఫ్యూజులు ఎగిరినట్టుగా అనిపిస్తాది శేఖర్ బాషా పంచులు వింటే. నేడు వాష్ రూమ్ లో అభయ్ నవీన్ మరియు శేఖర్ బాషా ఉంటారు. అభయ్ నవీన్ ముఖాన్ని కడుక్కుంటున్న సమయంలో శేఖర్ బాషా ఒక ప్రశ్న అడుగుతాడు. ఆయన మాట్లాడుతూ ‘ అత్యధిక శాతం మంది జనాలు సెప్టెంబర్ నెలలోనే పుడుతారట తెలుసా?’ అని అభయ్ ని అడుగుతాడు. తెలియదు అనగానే శేఖర్ బాషా మాట్లాడుతూ ‘తల్లి ఒక బిడ్డకి జన్మనిచ్చేది 9 వ తెలలోనే కదా’ అని అంటాడు. 9 వ నెల అంటే సెప్టెంబర్ కదా, కాబట్టి మనోడు అలా డీకోడ్ చేసి చూపించాడు అన్నమాట ఆడియన్స్ కి. ఇలాంటి ఎన్నో ఆణిముత్యాలు ఆయన వదులుతూనే ఉన్నాడు. మొదటి రోజు నుండి ఆదిత్య ఓం తో కలిసున్న శేఖర్ బాషా , అతనికి 200 జోక్స్ చెప్పాడట.

    నిన్న ఆదిత్య ఓం నాగార్జున కి ఈ విషయం చెప్పుకొని నవ్వుతున్నాడు. అయితే ఇలాంటి జోక్స్ కొంతకాలం వరకు అందరికీ బాగానే ఉంటాయి, ఒక సమయానికి ఇవే జోక్స్ వేస్తూ పోతే ఆడియన్స్ కి కూడా చిరాకు అనిపిస్తుంది. కాబట్టి ఇసువంటి జోక్స్ మోతాదు శేఖర్ బాషా రాబొయ్యే రోజుల్లో కాస్త తగ్గించుకుంటూ పోవాలి. టాస్కులు బాగానే ఆడుతున్నాడు, నామినేషన్స్ లో లాజిక్ పాయింట్స్ కూడా చక్కగా చెప్తున్నాడు. తన సొంత క్లాన్ లో చీఫ్ తప్పు చేసినా నిలదీసి ప్రశ్నించే దమ్ము, ధైర్యం కూడా శేఖర్ భాషలో ఉన్నాయి. చూడాలి మరి ఈ లక్షణాలు ఆయన్ని ఎక్కడ దాకా తీసుకెళ్లి ఆపుతుందో అనేది.