https://oktelugu.com/

Rashmika Mandana : హీరోయిన్ రష్మిక కి ప్రమాదం.. ఆందోళనలో అభిమానులు..సంచలనంగా మారిన లేటెస్ట్ ట్వీట్!

జీవితం చాలా చిన్నది, అందమైనది. ఉన్న ప్రతీ క్షణం ఆస్వాదించండి' అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకు ఏమి ప్రమాదం జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలను మాత్రం రష్మిక చెప్పలేదు.

Written By:
  • NARESH
  • , Updated On : September 9, 2024 / 09:42 PM IST

    Heroine Rashmika Mandana's accident

    Follow us on

    Rashmika Mandana : టాలీవుడ్ ఆడియన్స్ కి కేవలం రెండు మూడు సినిమాలతోనే బాగా దగ్గరైన హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా మనం రష్మిక గురించి మాట్లాడుకోకుండా ఉండలేము. నాగ శౌర్య హీరోగా నటించిన ‘ఛలో’ అనే చిత్రం ద్వారా ఆమె మన ఆడియన్స్ కి పరిచయం అయ్యింది. తొలి సినిమా భారీ హిట్ అవ్వడంతో ఆమెకి అవకాశాలు క్యూ కట్టాయి. ఈ చిత్రం తర్వాత ఆమె విజయ్ దేవరకొండ తో చేసిన ‘గీత గోవిందం’ చిత్రం ఇంకా పెద్ద హిట్ అవ్వడం తో రష్మిక మందన కి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు సంపాదిస్తూ, హిట్స్, సూపర్ హిట్స్ ని అందుకొని టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ గా నిల్చింది. అలా ఇండస్ట్రీ లోకి దూసుకొచ్చిన ఈమె ‘పుష్ప’ చిత్రం తో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించింది. పాన్ ఇండియా లెవెల్ లో ఆమెకి గుర్తింపు లభించడంతో ఆమెకి బాలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలు వచ్చాయి.

    అలా సందీప్ వంగ దర్శకత్వం లో రణబీర్ కపూర్ హీరో గా నటించిన ‘ఎనిమల్’ చిత్రంలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సుమారుగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది ఈ చిత్రం. ఇప్పుడు అందరూ రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ‘పుష్ప : ది రూల్’ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే రష్మిక సోషల్ మీడియా లో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉంటున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కానీ ఈమధ్య కాలం లో ఆమె తన ఇంస్టాగ్రామ్ లో కానీ, ట్విట్టర్ లో కానీ చాలా తక్కువ యాక్టీవ్ గా ఉండడాన్ని అభిమానులు గమనించారు. అలా యాక్టీవ్ గా లేకపోవడానికి గల కారణం ని నేడు రష్మిక చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘ నేను సోషల్ మీడియా ఈమధ్య కాలంలో యాక్టీవ్ గా ఉండడం లేదు.

    అదే విధంగా పబ్లిక్ లో కూడా ఎక్కువ కనిపించడం లేదు. అభిమానులు నాకు ఏమైందో ఏమో అని కంగారు పడుతూ మెసేజిలు పెట్టడం ఇప్పుడే చూసా. నేను యాక్టీవ్ గా ఉండకపోవడానికి కారణం చెప్పాల్సి వస్తుంది. అనుకోకుండా ఇటీవలే నాకు ఒక చిన్న ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఆ యాక్సిడెంట్ నుండి పూర్తిగా కోలుకున్నాను. ఈ సందర్భంగా నాకు అర్థమైంది ఒక్కటే, జీవితం చాలా చిన్నది, అందమైనది. ఉన్న ప్రతీ క్షణం ఆస్వాదించండి’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకు ఏమి ప్రమాదం జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలను మాత్రం రష్మిక చెప్పలేదు.