https://oktelugu.com/

ENG Vs SL: ఇంగ్లాండ్ బ్యాటర్ సరికొత్త ఘనత.. 147 ఏళ్ల చరిత్రలో మొదటిసారి అరుదైన రికార్డు

మూడో టెస్ట్ తొలి రోజు ఇంగ్లాండు కెప్టెన్ పోప్ సరికొత్త రికార్డు సృష్టించాడు. 147 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ ప్లేయర్ కూడా అందుకోలేని రికార్డు తన సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం పోప్ వయసు 26 సంవత్సరాలు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 7, 2024 / 03:24 PM IST

    ENG Vs SL(1)

    Follow us on

    ENG Vs SL: స్వదేశంలో శ్రీలంక జట్టుతో ఇంగ్లాండు టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే జరిగిన రెండు టెస్టులలో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ప్రస్తుతం మూడవ టెస్ట్ జరుగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయింది. 221 రన్స్ చేసింది. ఇంగ్లాండ్ కెప్టెన్ ఒలీ పోప్ 103 బంతుల్లో 103* పరుగులు చేశాడు. ఇతడి ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ బెన్ డకెట్ 79 బంతుల్లో 86 పరుగులు చేశాడు. ఇతడి ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. వెలుతురు లేకపోవడం.. వర్షం కురవడంతో మొదటిరోజు ఆట 44 ఓవర్లు మాత్రమే కొనసాగింది.

    మూడో టెస్ట్ తొలి రోజు ఇంగ్లాండు కెప్టెన్ పోప్ సరికొత్త రికార్డు సృష్టించాడు. 147 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ ప్లేయర్ కూడా అందుకోలేని రికార్డు తన సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం పోప్ వయసు 26 సంవత్సరాలు. ఇంగ్లాండ్ జట్టు తరఫున ఇప్పటివరకు అతడు 48 టెస్టులు ఆడాడు. 85 ఇన్నింగ్స్ లలో 34 సగటుతో, ఏడు సెంచరీలు, 13 అర్థ సెంచరీలతో 2,720 రన్స్ చేశాడు. అంతేకాదు ఇందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది.. పోప్ తను బాదిన ఏడు సెంచరీలను పలు దేశాలపై నమోదు చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక ఆటగాడు ఏడు శతకాలను వివిధ దేశాలపై సాధించడం ఇదే తొలిసారి.. ఇండియా, దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక జట్లపై అతడు సెంచరీలు చేశాడు.. మూడంకెల ఘనతను సొంతం చేసుకున్నాడు.

    ఈ ఘనత తో పాటు మరో రికార్డును కూడా పోప్ సాధించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో వేగంగా సెంచరీ చేసిన రెండవ ఇంగ్లాండ్ కెప్టెన్ గా వినతికెక్కాడు. ఈ స్థానంలో గ్రహం గూచ్ కొనసాగుతున్నాడు. లార్డ్స్ వేదికగా 1990లో భారత జట్టుపై 95 బంతుల్లోనే అతడు సెంచరీ చేశాడు. శ్రీలంకపై పోప్ 102 బంతుల్లో శతకం బాదాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. శ్రీలంక బౌలర్ల పై ప్రారంభించి ఎదురుదాడికి దిగాడు.. బౌలర్ ఎవరనేది లక్షపెట్టకుండా బాదడమే పనిగా పెట్టుకున్నాడు. అతడి దూకుడుకు ఇంగ్లాండు జట్టు స్కోర్ రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ లో ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. రెండో టెస్టులో 190 పరుగుల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది. మూడో టెస్ట్ లో ఇంగ్లాండ్ మెరుగైన ఆరంబాన్ని సాధించింది..ప్రస్తుతం క్రీజ్ లో పోప్, బ్రూక్ ఉన్నారు. బ్రూక్ 14 బంతుల్లో ఒక ఫోర్ సహాయంతో ఎనిమిది పరుగులు చేశాడు. శ్రీలంక బౌలర్లలో లాహిరుకుమార రెండు వికెట్లు సాధించాడు.. రత్నాయకె ఒక వికెట్ దక్కించుకున్నాడు.