ZIM stun Pakistan : టీ20 వరల్డ్ కప్ లో మరో సంచలనం నమోదైంది. ఏకంగా బలమైన బౌలింగ్, బ్యాటింగ్ దళమున్న పాకిస్తాన్ జట్టు వరుసగా రెండో మ్యాచ్ లోనూ ఓడిపోయింది. తొలి మ్యాచ్ లో భారత్ ను ఓడించినంత పనిచేసి పోరాడి ఓడిన పాకిస్తాన్ వరుసగా రెండో మ్యాచ్ లోనూ ఓడింది. ఆద్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో జింబాబ్వే పోరాట పటిమ తలవంచింది. చివరి 1 బంతికి 3 పరుగులు చేయాల్సిన దశలో పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ 1 పరుగు మాత్రమే చేసి ఓడిపోయింది. జింబాబ్వే ఫీల్డింగ్ మెరుపులకు కనీసం డ్రా చేసుకోలేకపోయిన పాకిస్తాన్ దారుణ ఓటమిని చవిచూసింది.

పాకిస్తాన్ బౌలింగ్ ధాటికి మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే కేవలం 130 పరుగులకే పరిమితమైంది. 8 వికెట్లు కోల్పోయి ఈ సాధారణ స్కోరు చేసింది. జింబాబ్వే బ్యాట్స్ మెన్ విలియమ్స్ 31 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
అనంతరం చిన్న లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఈజీగా గెలుస్తుందని అనుకున్నారు. ఎందుకంటే కేవలం 130 పరుగుల లక్ష్యమే కాబట్టి విజయం తథ్యం అనుకున్నారు. టీ20లో నంబర్ 1 బ్యాట్స్ మెన్ రిజ్వాన్, పాక్ కెప్టెన్ బాబర్ అజాం లాంటి భీకర లైనప్ ఉన్న పాకిస్తాన్ పేకమేడలా కుప్పకూలింది. బాబర్ 4, రిజ్వాన్14 పరుగులే చేసి ఔట్ అయ్యారు. ఆ తర్వా మసూద్ 44 ఒంటరి పోరాటం చేశాడు. మిగతా అందరూ చేతులెత్తేశారు. చివరకు మసూద్ కూడా ఔట్ కావడంతో లక్ష్యం పెరిగిపోయింది.
చివరి ఓవర్ లో కేవలం 8 పరుగులు చేస్తే గెలవాల్సిన దశలో 6 పరుగులు మాత్రమే చేసి పాకిస్తాన్ ఓడిపోయింది. కనీసం డ్రా చేసుకోలేకపోయింది. పాక్ బ్యాట్స్ మెన్ నవాజ్ చివరి ఓవర్ 4వ బంతికి ఔట్ కావడమే పాక్ ఓటమికి దారితీసింది. చివరి 2 బంతుల్లో 3 పరుగులు చేయాల్సిన దశలో నవాజ్ ఒక బంతికి ఔట్ కావడం.. మరో బంతికి కేవలం 1 రన్ మాత్రమే వచ్చి పాక్ బ్యాట్స్ మెన్ రనౌట్ కావడంతో జింబాబ్వే విజయం సాధించింది. బౌలింగ్ లో 3 పాక్ కీలక వికెట్లు తీసిన సికిందర్ రజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది.
ఇక బలమైన పాక్ పై గెలవడంతో జింబాబ్వే ఆటగాళ్లు భావోద్వేగంతో ఏడ్చేశారు. ప్రేక్షకులతో కలిసి మైదానం అంతా తిరిగి స్టేడియం మొత్తం డ్యాన్సులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. కలలో కూడా ఊహించని ఈ విజయంతో అందరూ ఎమోషనల్ అయ్యారు.
ఇటు టీమిండియా చేతిలో ఓడి.. జింబాబ్వే చేతిలోనూ ఓడిపోవడంతో సెమీస్ అవకాశాలను పాకిస్తాన్ క్లిష్టం చేసుకుంది. భారత్ చేతిలో ఓటమిని పాకిస్తాన్ ను కృంగదీసినట్టైంది. అదే రెండో మ్యాచ్ లోనూ ప్రతిఫలించినట్టుంది.