Unstoppable with NBK : నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో ఎంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..బాలయ్య బాబు లో ఈ యాంగిల్ కూడా ఉందా? అని అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు..ఇటీవలే ఈ షో కి సంబంధించి సీజన్ 2 కూడా ప్రారంభమైంది.. సీజన్ -2 కూడా మొదటి ఎపిసోడ్ నుండే అద్భుతమైన వ్యూస్ ని సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతోంది.

మొదటి ఎపిసోడ్ కి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆయన కుమారుడు లోకేష్ హాజరు కాగా..రెండో ఎపిసోడ్ కి DJ టిల్లు హీరో సిద్దు , విశ్వక్ సేన్ హాజరయ్యారు..ఈ రెండు ఎపిసోడ్స్ కూడా మంచి హిట్ అయ్యాయి..ఇక మూడోఎపిసోడ్ కి ఎవరు రాబోతున్నారు అని ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానులకు ఈ వారం తీవ్రమైన నిరాశే ఎదురైంది.
ఎందుకంటే ఈ వారం కొత్త ఎపిసోడ్ లేదట..సెలెబ్రిటీల డేట్స్ సమస్య ఏర్పడడం తో పాటుగా బాలయ్య బాబు హీరోగా నటిస్తున్న ‘వీర సింహా రెడ్డి’ సినిమాకి సంబంధించి కీలకమైన షెడ్యూల్ జరుగుతుండడంతో ఆయన ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ షూటింగ్ కి పాల్గొనలేకపోయారట..దీనితో నారా చంద్రబాబు నాయుడు తో చేసిన మొదటి ఎపిసోడ్ ‘అన్ సెన్సార్’ కంటెంట్ ని ఈ శుక్రవారం స్ట్రీమింగ్ చేయబోతున్నారట..దీనితో కొత్త సెలబ్రిటీ తో బాలయ్య బాబు ఈ వారం సందడి చెయ్యలేకపోయాడే అని ఈ షో కోసం ఎదురు చూసే ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు..ఇక ‘అన్ స్టాపబుల్’ షో లో తదుపరి వారం రాబోయే సెలబ్రిటీ ప్రముఖ హీరోయిన్ మరియు మంత్రీ ‘రోజా’ గారట.
రోజా గారు వైసీపీ పార్టీ..బాలయ్య బాబు తెలుగు దేశం పార్టీ..రాజకీయ పరంగా పార్టీలు వేరైనా కూడా..వ్యక్తిగతంగా రోజా గారితో మంచి సాన్నిహిత్యం ఉంది..ఈ విషయం రోజా గారు ఎన్నో సందర్భాలలో తెలిపారు కూడా..ఇక వచ్చే వారం ప్రసారం కాబోతున్న వీళ్లిద్దరి ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.