Analysis On CM KCR MLA Purchase Issue : ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసీఆర్ డ్రామాలాగా కనిపిస్తోందని కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల మంత్రిపై హత్యాయత్నం జరిగిందంటూ సానుభూతి మంత్రం జపించిన కేసీఆర్ సర్కార్.. ఈరోజుకు ఆ కేసు ఏమైందో ఎవరికీ తెలియకుండా చేసిందంటే. అర్థం ఏంటి? ఇప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం చూస్తే మునుగోడులో టీఆర్ఎస్ కు పరిస్థితి బాగాలేదని అర్థమవుతోందని అంటున్నారు. ? ఎందుకు ఇది స్క్రిప్ట్ లా అనిపిస్తుందంటే? ఈసారి కేసీఆర్ చేసిన స్క్రీన్ ప్లే అతకలేదని అర్థమవుతోంది.

ఇన్ని కోట్ల నగదు దొరికిందంటున్న కారు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నియోజకవర్గంలో తిరిగేదనట.. ఈసారి కేసీఆర్ ప్లాన్ అతకకపోవడానికి మరో కారణం.. ముక్కు మొఖం తెలియని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏకంగా రూ.100 కోట్లు చెల్లిస్తామనడాన్ని జనాలు నమ్మడం లేదు. ఈటల రాజేందర్ లాంటి వారో.. లేక హరీష్ రావుకో ఈ మొత్తం ఇస్తున్నారంటే నమ్మవచ్చు. కానీ వీళ్లకు అంత ఇవ్వడం అనేసరికి కేసీఆర్ సర్కార్ ప్రకటన ను ఎవరూ నమ్మడం లేదు.
ఈ నలుగురు ఎమ్మెల్యేల గురించి బీజేపీ రూ.100 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే జనాలు నమ్మడం లేదు. ఇందులో ముగ్గురు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి జంప్ చేసినవారే. ఇక గువ్వల బాలరాజు కేసీఆర్ కు నమ్మినబంటు. సో కేసీఆర్ ఎంపిక చేసిన ఎమ్మెల్యేలు పాత్రధారులుగా సూట్ కాలేదని తెలుస్తోంది.
ఈ మంతనాల్లో ఒక్క బీజేపీ నాయకుడు ఎవరైనా ఉంటే కొంతైన బలమైన సాక్ష్యం ఉండేది. అది కూడా తీసుకురాలేకపోయారు. ఫాంహౌస్ లో ఎంత డబ్బు దొరికిందో పోలీసులు చెప్పలేదు. పథకం ప్రకారం ఇదంతా జరిగిందని జనాలకు అనుమానం వస్తోంది.
అసలు ఇది కేసీఆర్ డ్రామా అని అర్థమవుతోంది. దొరికిన ఎమ్మెల్యేలంతా ప్రగతిభవన్ వెళ్లడంతో ఈ అనుమానాలు బలపడ్డాయి. ఇదంతా కేసీఆర్ ఎందుకు చేస్తున్నారు? ఈ స్కెచ్ వెనుక కారణమేంటి? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.