Rohit Sharma: కాసిన చెట్టుకే రాళ్ల దెబ్బలు.. రోహిత్ ను అలా చూస్తే గుండె తరుక్కుపోతోంది. వీడియో వైరల్..

ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ నిదానంగా ఆడాడని.. అందువల్లే ముంబై ఓడిపోయిందని.. అతడు స్వార్ధపరుడు అంటూ నెటిజెన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 15, 2024 5:11 pm

Seeing Rohit Sharma like that is heart breaking

Follow us on

Rohit Sharma: సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో ఆదివారం రాత్రి చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఓడిపోయింది. ఇటీవల రెండు వరుస మ్యాచ్లో గెలిచి.. గెలుపు ట్రాక్ ఎక్కిందనుకునే దశలోనే.. ముంబై చెన్నై జట్టుతో ఓటమి ఎదుర్కొని పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి పడిపోయింది. ఈ మ్యాచ్లో చెన్నై 206 పరుగులు చేసింది. చెన్నై జట్టు ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని చివర్లో 4 బంతుల్లో 20 పరుగులు సాధించాడు. అతడు సాధించిన పరుగులే చెన్నై జట్టును గెలిపించాయి. చివరి ఓవర్ ను హార్దిక్ పాండ్యా వేశాడు. ఆ ఓవర్లో ధోని బ్యాట్ తో వీరవిహారం చేశాడు. ఏకంగా మూడు సిక్సర్లు కొట్టాడు. అయితే చివరి ఓవర్ వేయడం పట్ల కెప్టెన్ హార్దిక్ పాండ్యా పై విమర్శలు వ్యక్తవుతున్నాయి. ఇదే సమయంలో చేజింగ్ లో ముంబై జట్టు తరఫున ఆడిన రోహిత్ శర్మ చేసిన సెంచరీ పట్ల కూడా ట్రోల్స్ వ్యక్తమవుతున్నాయి.

ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ నిదానంగా ఆడాడని.. అందువల్లే ముంబై ఓడిపోయిందని.. అతడు స్వార్ధపరుడు అంటూ నెటిజెన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగానే రోహిత్ అభిమానులు బాధపడే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. “కాసిన చెట్టుకే రాళ్ల దెబ్బలు” అన్న సామెత తీరుగా రోహిత్ శర్మ పరిస్థితి మారిపోయిందని అభిమానులు అంటున్నారు. చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు సెంచరీ చేసినప్పటికీ.. నిదానంగా ఆడాడని విమర్శలు వినిపిస్తున్నాయి. మరికొందరేమో రోహిత్ శర్మకు అండగా నిలుస్తున్నారు. అతడికి మద్దతుగా మాట్లాడుతున్నారు. ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లభించి ఉంటే ముంబై కచ్చితంగా గెలిచేదని వారు అంటున్నారు. అంత వీరోచితంగా బ్యాటింగ్ చేసినప్పటికీ ముంబై జట్టు ఓడిపోవడంతో రోహిత్ శర్మ బాధతో ప్రీమియం చేరాడు.. సాధారణంగా మ్యాచ్ ఓడిపోయినా, గెలిచినా ప్రత్యర్థి ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇస్తారు. కానీ ముంబై జట్టు ఓడిపోయిన తర్వాత రోహిత్ శర్మ షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కూడా ఇష్టపడలేదు. ముంబై జట్టు సహచరులు మొత్తం ఒకవైపు ఉంటే.. అతడు మాత్రం ఒక యోధుడి లాగా వెళ్లిపోయాడు. భారంగా అడుగులు వేసుకుంటూ.. నేల చూపులు చూస్తూ వెళ్లిపోయాడు. ఆ వీడియో చూసిన అతని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “ముంబై జట్టు ఓడిపోయినా, నీ ఇన్నింగ్స్ వృధా అయినా.. నువ్వంటే మాకు ఎప్పటికీ గౌరవమే. మా ఆరాధ్య క్రికెటర్ అంటూ” సోషల్ మీడియాలో రోహిత్ శర్మ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

వాస్తవానికి ఈ మ్యాచ్లో రోహిత్ శర్మకు మరో బ్యాటర్ నుంచి సహకారం లభించలేదు. కిషన్ తో కలిసి 70 పరుగులు, తిలక్ వర్మతో కలిసి 60 పరుగుల భాగస్వామ్యాలను నిర్మించిన రోహిత్ శర్మకు.. వారిద్దరూ అవుట్ అయిన తర్వాత మరో బ్యాటర్ నుంచి సహకారం లభించలేదు. సూర్య కుమార్ యాదవ్ డకౌట్ అయ్యాడు.. హార్దిక్ పాండ్యా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. డేవిడ్ వంటి కీలక ఆటగాడు కూడా హ్యాండ్ ఇవ్వడంతో రోహిత్ శర్మ ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. ఓపెనర్ గా మైదానంలోకి దిగిన అతడు చివరి వరకు క్రీజ్ లో ఉన్నాడు. అయినప్పటికీ మ్యాచ్ ను చివరి బంతి వరకు తీసుకొచ్చాడు. రోహిత్ పోరాటం పట్ల సోషల్ మీడియాలో అభిమానుల నుంచి కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.