https://oktelugu.com/

Kalki 2898 AD : కల్కి సినిమాలో కమలహాసన్ ప్రభాస్ కి మధ్య జరిగే ఫైట్ కోసం ఆ కెమెరాను వాడుతున్నారా..?

ఇక సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుంది అంటూ సినిమా యూనిట్ మంచి ఆశ భవాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి క్రమంలో నాగ్ అశ్విన్ ఈ సినిమాతో భారీ సక్సెస్ కొట్టినట్లైతే ఇండియన్ లెవల్లో టాప్ డైరెక్టర్ గా.ఎదుగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు...

Written By:
  • NARESH
  • , Updated On : April 15, 2024 / 06:06 PM IST

    Kalki 2898 AD

    Follow us on

    Kalki 2898 AD : ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న డైరెక్టర్స్ అందరూ ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేయాలని ఆసక్తిని చూపిస్తున్న విషయం మనకు తెలిసిందే..ఎందుకంటే ప్రస్తుతం ఇండియాలో ఉన్న ఏ ఒక్క హీరో కూడా ప్రభాస్ ని బీట్ చేసే స్థాయిలో లేడు. ఇక ఇప్పటికి కూడా ఆయన నెంబర్ వన్ హీరో కొనసాగుతున్నాడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    ఇక మహానటి సినిమాతో ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ ని పెట్టి తెరకెక్కిస్తున్న ఈ సినిమా తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ కి విలన్ గా కమలహాసన్ నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే వీళ్ళిద్దరి మధ్య ఒక భారీ ఫైట్ సీన్ కూడా ఉండబోతుందట. అయితే ఈ ఫైట్స్ ను దర్శకుడు చాలా డిఫరెంట్ వే లో ప్రజెంట్ చేయబోతున్నట్లు కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ ఫైట్ సీన్ కోసం “మోకో బూట్ రోబోట్ కెమెరా ” ని వాడుతున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఇప్పటి వరకు ఈ కెమెరాని విక్రమ్ , లియో లాంటి సినిమాల్లో వాడారు. దీని ద్వారా షూట్ చేయడం వల్ల ఆర్టిస్టులకి ఎక్కువ ఇబ్బంది కలిగే అవకాశాలు లేకుండా ఉంటుంది. అలాగే రోబోట్ ద్వారా ఆపరేట్ చేసే ఈ కెమెరాలు యాంగిల్స్ కూడా మన ఇష్టం వచ్చినట్టుగా మార్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ కెమెరాని వీళ్ళ ఫైట్ సీక్వెన్స్ కోసం వాడుతున్నారట. ఇక మొత్తానికైతే నాగ్ అశ్విన్ ఈ సినిమాతో ఒక విజువల్ వండర్ ను సృష్టించబోతున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుంది అంటూ సినిమా యూనిట్ మంచి ఆశ భవాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి క్రమంలో నాగ్ అశ్విన్ ఈ సినిమాతో భారీ సక్సెస్ కొట్టినట్లైతే ఇండియన్ లెవల్లో టాప్ డైరెక్టర్ గా.ఎదుగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…