Homeక్రీడలుక్రికెట్‌Sanju Samson Century IPL 2026: ఇప్పుడే కాదు.. అప్పుడు, అంతకు ముందు కూడా.. అది...

Sanju Samson Century IPL 2026: ఇప్పుడే కాదు.. అప్పుడు, అంతకు ముందు కూడా.. అది సంజూ శాంసన్ కే సాధ్యం

Sanju Samson Century IPL 2026: టి20 వరల్డ్ కప్ తర్వాత.. ఐపీఎల్ (Indian premier league 2026) లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super Kings) జట్టు తరఫున ఆడుతున్న సంజూ శాంసన్ (Sanju Samson) ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు.. గట్టిగా నిలబడలేకపోతున్నాడు. చెప్పుకునే స్థాయి నుంచి మొదలుపెడితే.. అసలు ఎందుకు ఇతడిని తీసుకున్నారనే స్థాయికి తన ఆట తీరును దిగజార్చుకున్నాడు. దీంతో అసలు సంజు టాప్ గేర్ లోకి రాడా.. తన స్థాయినిషాడ లేడా.. అనే ప్రశ్నలు మొదలయ్యాయి. మీడియాలో విపరీతంగా కథనాలు ప్రసారం అయ్యాయి.

తన మీద వస్తున్న విమర్శలకు.. వ్యతిరేక కథనాలకు కేవలం ఒకే ఒక ఇన్నింగ్స్ ద్వారా సమాధానం చెప్పాడు సంజు. తన ఇన్నింగ్స్ తో చెన్నై జట్టు ఢిల్లీ మీద ఆదివారం విన్నింగ్స్ గా మార్చడంతో సంజు శాంసన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సంజు సూపర్ సెంచరీ చేశాడు. తన నిలబడితే ఎలా ఉంటుందో.. కలబడి బంతిని కొడితే ఎలా ఉంటుందో ప్రత్యర్థి బౌలర్లకు రుచి చూపించాడు. 56 బంతులు ఎదుర్కొని.. 15 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 115 పరుగులు చేశాడు సంజు. ఓపెనర్ గా వచ్చిన అతడు.. చివరి వరకు అలానే నిలబడ్డాడు. తను అనుకుంటే ఎలా ఉంటుంది.. గట్టిగా అనుకుంటే ఎంత గొప్పగా ఉంటుందో చెన్నై అభిమానులకు చూపించాడు. దీంతో చెన్నై అభిమానులు ఇతడిని జూనియర్ తలా అని పిలుస్తున్నారు.

సంజు ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సెంచరీ చేశాడు. 2026 ఐపిఎల్ సీజన్లో సంజుదే తొలి సెంచరీ కావడం విశేషం. అంతేకాదు ఢిల్లీ పై సెంచరీ చేసిన తర్వాత సంజు అనేక రికార్డులను తన పేరు మీద రాసుకున్నాడు. ఐపీఎల్ లో మూడు జట్లు (ఢిల్లీ, రాజస్థాన్ రాయల్స్, చెన్నై) జట్ల తరఫున సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. ఈ ఘనత అందుకున్న రెండవ ఆటగాడిగా అతడు నిలిచాడు. గతంలో కేఎల్ రాహుల్ పంజాబ్, లక్నో, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల తరఫున సెంచరీలు సాధించాడు.. అయితే కేఎల్ రాహుల్, సంజు శాంసన్ ప్రత్యర్థులుగా తల పడటం విశేషం. ఈ ఐపీఎల్ లో సంజు తన స్థాయి ఇన్నింగ్స్ ఆడ లేక ఇబ్బంది పడుతున్నాడు. త్వరగానే ఔటై నిరాశ పరుస్తున్నాడు. అయితే ఇప్పుడు సంజు సరికొత్తగా కనిపిస్తున్నాడు. బ్యాటింగ్ స్టైల్ మార్చుకున్నాడు. బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. అందువల్లే సెంచూరియన్ అయ్యాడు.

సంజు చేసిన సెంచరీ వల్ల చెన్నై వరుస ఓటముల నుంచి విముక్తి పొందింది. సొంత అభిమానులలో ఆనందాన్ని నింపింది. అంతేకాదు ట్రోఫీపై ఆశలను సజీవంగా నింపుకుంది. సంజు గనక ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే.. ఇదే స్థాయిలో బ్యాటింగ్ చేస్తే చెన్నై జట్టుకు తిరుగుండదు. ఎందుకంటే అతడు ఆల్రెడీ టీం ఇండియాకు టి20 వరల్డ్ కప్ అందించాడు. అతడి సత్తా మరోసారి ఐపీఎల్లో టి20 వరల్డ్ కప్ లెవెల్ లో ప్రదర్శితమైతే.. అది వేరే లెవెల్.. చెన్నై అభిమానుల భాషలో చెప్పాలంటే విజిల్ పోడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular