Sania Mirza: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అభిమానుల ఆగ్రహానికి గురవుతోంది. భారత పౌరసత్వం అనుభవిస్తూ పాకిస్తాన్ కు మద్దతు పలకడంపై విమర్శల వెల్లువ కొనసాగుతోంది. టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భారత్ ఆటనుంచి నిష్క్రమించే వరకు ఆమె గదులకే పరిమితమైంది. ఎప్పుడైతే భారత్ టోర్నీ నుంచి వెనుదిరిగిందో అప్పుడు తన భర్త షోయబ్ మాలిక్ తో గ్యాలరీలో సందడి చేసింది. దీంతో భారత అభిమానుల ఆగ్రహానికి గురైంది.

గురువారం జరిగిన పాకిస్తాన్, ఆసిస్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో పాక్ ఆటగాళ్లకు మద్దతు పలుకుతూ చప్పట్లు కొడుతూ కనిపించింది. భారత్ లో పుట్టి ఉగ్రవాద దేశానికి మద్దతు పలకడంపై అభిమానుల్లో కోపం కట్టలు తెంచుకుంటోంది. ఈ దేశ సంపదతో తన మనుగడ కొనసాగిస్తూ పాక్ కు మద్దతు పలకడంపై అందరిలో ఆశ్చర్యం కలుగుతోంది.
ఈ నేపథ్యంలో పలువురు అభిమానులు ప్రధాని మోడీకి ట్వీట్లు చేశారు. ఆమె పౌరసత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు మన తిండి తింటూ పరాయి వారికి మద్దతుగా నిలవడంపై జీర్ణించుకోలేకపోతున్నారు. సానియా మీర్జాపై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ లో ఓ ఉపాధ్యాయురాలు పాక్ గెలుపును వేడుకగా జరుపుకున్నందుకు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు మన దేశం కోసం కాకుండా శత్రు దేశంకోసం మద్దతు తెలిపిన సానియాపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని ప్రశ్నిస్తున్నారు. సానియా పాక్ కు మద్దతు ఇవ్వడంపై పలు రకాల కామెంట్లు వస్తున్నాయి. సానియాపై చర్యలు తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు.
Also Read: Team India: విరాట్ కోహ్లీ, రోహిత్ ను కలిసి ఇక ఆడించరా?