మహేశ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. హైదరాబాద్ లో ఉన్న బ్యాంకులో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. మొత్తం 10 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలలో డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలు 7 ఉండగా జనరల్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలు 3 ఉన్నాయి. బిజినెస్ డెవలప్‌మెంట్, క్రెడిట్ అండ్ ఆపరేషన్స్, ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ట్రెజరీ విభాగాలలో ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.
గ్రాడ్యుయేషన్/పోస్టు గ్రాడ్యుయేషన్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఎంబీఏ/సీఎఫ్‌ఏ/ఐసీడబ్ల్యూఏ/సీఏ/సీఎస్/సీఏఐఐబీ చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. సంబంధిత పనిలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. 55 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫైనాన్స్ అండ్ అకౌంట్స్/ట్రెజరీ, లా, ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్, హ్యూమన్ రిసోర్సెస్ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. సంబంధిత పనిలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
53 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈమెయిల్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 17వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండగా అభ్యర్థులు recruit@apmaheshbank.com ఈ మెయిల్ ఐడీకి మెయిల్ చేయాల్సి ఉంటుంది.