Sandeep Sharma Catch: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 వ ఎడిషన్ అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతుండడంతో అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. యువ క్రికెటర్లకు పోటీగా సీనియర్ ప్లేయర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. యువ క్రికెటర్లకు తామెందులోనూ తక్కువ కాదన్నట్లుగా ఫీల్డింగ్ లోను అదరగొడుతున్నారు పలువురు సీనియర్ క్రికెటర్లు. తాజాగా ముంబైతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ సందీప్ శర్మ అద్భుతమైన ఫీల్డింగ్ తో ఆశ్చర్యానికి గురి చేశాడు.
ఐపిఎల్ లో ఫీల్డింగ్ మెరుపులు మామూలుగా లేవు. అద్భుతమైన డ్రైవ్ లు, సూపర్ మ్యాన్ తరహాలో ఎగిరి పడుతున్న క్యాచ్ లతో ఈ ఐపీఎల్ అధరహో అనిపిస్తోంది. ఫీల్డింగ్ లో అయితే ఈ సీజన్ లో అందరు ఆటగాళ్లు అదరగొడుతున్నారు. అసాధ్యమైన క్యాచ్ లు అందుకుంటూ ఎంతోమందిని పెవిలియన్ బాట పట్టిస్తున్నారు పలువురు ఫీల్డర్లు.
19 మీటర్లు వెనక్కి వెళ్లి క్యాచ్ పట్టిన సందీప్ శర్మ..
ముంబైతో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ బౌలర్ సందీప్ శర్మ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. అప్పటికే మ్యాచ్ లో స్వైర విహారం చేస్తున్న సూర్య కుమార్ యాదవ్.. బౌల్ట్ బౌలింగ్ లో వెనుక వైపు తన ట్రేడ్ మార్క్ షార్ట్ ఆడాడు. అయితే ఈ బంతిని క్యాచ్ గా పట్టడం ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఫీల్డింగ్ ఫోజిషన్ కు చాలా దూరంగా బంతి పడబోతోంది.
కానీ సందీప్ శర్మ దాదాపు 19 మీటర్లు వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి డ్రైవ్ చేస్తూ బాల్ అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాచ్ అని నెటిజన్లు ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్లు చేస్తున్నారు. బౌలింగ్ లో అధరగొడుతున్న సందీప్ శర్మ ఈ తరహా క్యాచ్ పట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని పలువురు పేర్కొంటున్నారు. బౌలింగ్ లోను అదరగొడుతున్న సందీప్ శర్మ పట్టిన ఈ క్యాచ్ వీడియో అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. సందీప్ శర్మ లో అద్భుతమైన బౌలర్ తో పాటు మంచి ఫీల్డర్ కూడా ఉన్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు పలువురు నెటిజన్లు. ఏది ఏమైనా సందీప్ శర్మ పట్టిన క్యాచ్ చూసి అభిమానులు మెస్మరైజ్ అవుతున్నారు.
WHAT. A. CATCH!
Spectacular effort from Sandeep Sharma to get the wicket of Suryakumar Yadav #MI need 43 off 18.
Follow the match ▶️ https://t.co/trgeZNGiRY #IPL1000 | #TATAIPL | #MIvRR pic.twitter.com/0PVyi5z7SB
— IndianPremierLeague (@IPL) April 30, 2023