Saina Nehwal – Jaspreet bumrah: సోషల్ మీడియాలో క్రీడాకారులు చేసే ట్వీట్లకు విపరీతమైన స్పందన వస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనదేశంలో క్రీడాకారులు చేసే ట్వీట్లు సంచలనం అవుతుంటాయి. అలా మనదేశంలోని స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ సోషల్ మీడియాలో చేసిన ఒక ట్వీట్ సంచలనంగా మారింది. ఆమె చేసిన ట్వీట్ శనివారం మొత్తం ట్రెండింగ్ లోనే ఉంది. ఆమె ట్వీట్ చేయడం.. ఇతర ఆటగాళ్లు స్పందించడంతో నెటిజన్లు ఆసక్తిగా గమనించారు. కొందరు వాటిని రీ ట్వీట్ చేశారు. మరికొందరు తమదైన శైలిలో కామెంట్ చేశారు. అయితే సైనా నెహ్వాల్ చేసిన ట్వీట్లు పలు స్పోర్ట్స్ చానల్స్ కు మంచి మసాలా లాంటి కంటెంట్ అందించాయి.. ఇంతకీ సోషల్ మీడియాలో సైనా నెహ్వాల్ ఎందుకు ట్వీట్ చేశారు.. మిగతా ఆటగాళ్లు ఎందుకు రెస్పాండ్ అయ్యారు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.
భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన ప్రతిభతో బ్యాడ్మింటన్ లో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. అయితే ఆమె సోషల్ మీడియాలో ఇతర క్రీడలను క్రికెట్ తో సరితూస్తూ కామెంట్ వ్యాఖ్యలు చేసింది. అవి నెట్టింట ఆసక్తికర చర్చకు దారి తీశాయి. శారీరకంగా బ్యాడ్మింటన్, టెన్నిస్, బాస్కెట్ బాల్ క్రికెట్ కంటే అత్యంత కష్టంగా ఉంటాయని సైనా పేర్కొంది. ఈ వ్యాఖ్యల పట్ల యువ క్రికెటర్ రఘవంశీ స్పందించాడు. దీనికి సరైన సమాధానాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే అతడి వెంటనే దానిని డిలీట్ చేశాడు. అయితే అప్పటికే అది సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారింది. రఘు వంశీ చేసిన వ్యాఖ్యల పట్ల మరోసారి సైనా నెహ్వాల్ స్పందించింది. కీలకమైన వ్యాఖ్యలు చేసింది.
“జస్ ప్రీత్ బుమ్రా వేగంగా బంతులు వేస్తాడు. అతడు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తే సైనా తట్టుకుంటుందా? ఏమో ఇలాంటి వాటిని చూడాలి” అని రఘువంశి ట్వీట్ చేశాడు. ఆ తర్వాత డిలీట్ చేశారు. దానిపై సైనా స్పందించింది. ” నువ్వు క్రికెటర్ వే కదా. నువ్వు కూడా ఆడుతున్నావు కదా. విరాట్ కోహ్లీ లాగా క్రికెట్ లో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పగలవా. లేకుంటే రోహిత్ లాగా దూకుడుగా బ్యాటింగ్ చేయగలవా. రోహిత్, కోహ్లీ మాదిరి ఆడాలి అని చాలామంది అనుకుంటారు. కానీ అలా అవ్వడం కష్టం. అతి కొంతమంది మాత్రమే ఆ స్థాయికి చేరుకోగలరు. అది మొత్తం వారి నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఇక భవన విషయానికి వస్తే.. వారి శ్రమను నేను అర్థం చేసుకుంటాను. ఒకవేళ నేను ఎన్ని సంవత్సరాల నుంచి క్రికెట్ కనుక ఆడుతూ ఉండి ఉంటుంటే కచ్చితంగా బుమ్రా ను ఎదుర్కొని ఉండేదాన్ని. ఇదే సమయంలో బుమ్రా కనుక బ్యాడ్మింటన్ ఆడి ఉంటే నేను కొట్టే స్మాష్ లను అతడు అడ్డుకొని ఉండేవాడు కాదు. మనం దేశం కోసం ఆడుతున్నాం. మనం పేరుపొందిన ఆటగాళ్ళం. అలాంటప్పుడు ఇలాంటి విషయాల మీద పోరాడుకోవాల్సిన అవసరం లేదని” సైనా నెహ్వాల్ వ్యాఖ్యానించింది.. ప్రతి క్రీడను అత్యుత్తమమైనదిగా నెహ్వాల్ అభివర్ణించింది. ఇతర క్రీడలకు కూడా విలువ ఇవ్వాలని కోరింది. అలా జరగకపోతే క్రీడా సంప్రదాయం వర్ధిల్లదని వాపోయింది. అలాంటి మనసు కనుక లేకుంటే బాలీవుడ్, క్రికెట్ పై మాత్రమే అందరి దృష్టి ఉంటుందని సైనా నెహ్వాల్ కుండబద్దలు కొట్టింది.