Bigg Boss Telugu season 8 : గత ఏడాది స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 7 ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు వచ్చిన అన్నీ సీజన్స్ కంటే గత సీజన్ కి అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయట. అందుకే బిగ్ బాస్ సీజన్ 8 ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని టాస్కులతో, కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యారట. ఇకపోతే ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి ఇప్పటి వరకు మీరు సోషల్ మీడియా లో ఎన్నో పేర్లు వినే ఉంటారు. కానీ బిగ్ బాస్ యాజమాన్యం రీసెంట్ గానే కంటెస్టెంట్స్ తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట.
వారిలో తేజస్విని గౌడా, బంచిక్ బబ్లూ, అంజలి పవన్, రీతూ చౌదరి ఉన్నారు. మిగిలిన వారికి రీసెంట్ గానే ఇంటర్వూస్ పూర్తి చేశారట. వీళ్ళు నూటికి 99 శాతం బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. వాళ్లెవరో ఒకసారి చూద్దాం. మొట్టమొదటిగా మనం మాట్లాడుకోబోతున్న కంటెస్టెంట్ పేరు యష్మీ గౌడా. ఈమె జీ తెలుగు ఛానల్ లో అప్పట్లో సూపర్ హిట్ గా నిల్చిన ‘నాగభైరవి’ అనే సీరియల్ లో హీరోయిన్ గా నటించింది. అలాగే స్టార్ మా ఛానల్ లో పెద్ద హిట్ గా నిల్చిన ‘కృష్ణా ముకుందా మురారి’ సీరియల్ లో విలన్ గా కూడా నటించింది. అలాగే పలు ఎంటర్టైన్మెంట్ షోస్ లోనూ, డ్యాన్స్ షోస్ లోనూ పాల్గొని బుల్లితెర ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవ్వడం దాదాపుగా ఖరారు అయ్యినట్టే అంటున్నారు. అలాగే బిగ్ బాస్ హౌస్ లోకి రాబోతున్న మరో కంటెస్టెంట్ సౌమ్య రావు. ఈమె ఈటీవీ లో పాపులర్ కామెడీ షో జబర్దస్త్ కి యాంకర్ గా చేసింది. అలాగే ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో ప్రతీ శనివారం, ఆదివారం ప్రసారమయ్యే ‘కిరాక్ బాయ్స్..కిలాడి లేడీస్’ షోలో ఒక కంటెస్టెంట్ గా చేస్తుంది. అలాగే మొగలిరేకులు సీరియల్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సీరియల్ లో హీరోలు గా నటించిన ఇంద్రనీల్, సెల్వరాజ్ కూడా ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గా పాల్గొనబోతున్నట్టు సమాచారం.
అలాగే లాహిరి లాహిరి లాహిరిలో చిత్రంలో హీరో గా నటించిన ఆదిత్య ఓం కూడా ఈ షో లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే సోషల్ మీడియా లో ఎంతోకాలం నుండి బర్రెలక్క బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతుంది అంటూ టాక్ వినిపించేది. ఈ సీజన్ లో ఆమె పాల్గొనే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయని, బిగ్ బాస్ టీం ఆమెని కూడా ఇంటర్వ్యూ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వారానికి రెండు లక్షల 30 వేల రూపాయిలు ఆమెకి రెమ్యూనరేషన్ ఆఫర్ కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇది ఇప్పటి వరకు ఖరారైన పేర్లు, రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని పేర్లు ఖారారు కానున్నాయి.