Saina Nehwal Parupalli Kashyap Divorce: సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ బ్యాడ్మింటన్ లో సరికొత్త చరిత్రలు సృష్టించారు. సింగిల్స్ లో వీరిద్దరికి అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. బ్యాడ్మింటన్ ద్వారా పరిచయమైన వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. వీరిద్దరి మధ్య దాదాపు రెండు దశాబ్దాల స్నేహం ఉంది. ముందుగా స్నేహితులైన వేరు ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. సుదీర్ఘకాలం ప్రేమలో ఉన్న తర్వాత వివాహం చేసుకున్నారు.. ఎక్కడికి వెళ్లినా వీరిద్దరూ జంటగానే కనిపించేవారు. పలు కార్యక్రమాలలో పాల్గొని అభిమానులతో సందడి చేసేవారు. అటువంటి వీరిద్దరూ తీసుకున్న నిర్ణయం బ్యాడ్మింటన్ వర్గాల్లో సంచలనం సృష్టించింది.
Also Read: వింబుల్డన్ విజేతకు 35 కోట్ల ప్రైజ్ మనీ మాత్రమే కాదు.. అంతకుమించి సౌకర్యాలు, సదుపాయాలు..
2018లో సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ వివాహ బంధంలో అడుగు పెట్టారు. మొదట్లో వీరిద్దరి వైవాహిక బంధం సజావుగానే సాగింది. వివాహం జరిగిన తర్వాత కూడా సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ వివిధ పోటీలలో పాల్గొన్నారు. ఆ తర్వాత సైనా నెహ్వాల్ ను గాయాలు వెంటాడాయి. దీనికి తోడు ఆమె ప్రత్యర్థి పీవీ సింధు వరుస విజయాలతో దూసుకుపోయింది. ఇదే సమయంలో పుల్లెల గోపీచంద్ తో సైనా నెహ్వాల్ కు విభేదాలు ఏర్పడ్డాయని వార్తలు వచ్చాయి. దీంతో ఆమె బెంగళూరులో శిక్షణ తీసుకుంది. అయినప్పటికీ విజయాలు అందుకోలేకపోయింది. ఫలితంగా కెరియర్ ఇబ్బందుల్లో పడింది.. మరోవైపు పారుపల్లి కశ్యప్ కెరియర్ కూడా అంతగా సాగడం లేదు. వరుస పరాజయాలు.. కొత్త రక్తం రావడంతో బ్యాడ్మింటన్ లో అతడి ప్రస్థానం కూడా ఇబ్బందుల్లో పడింది. దీంతో వీరిద్దరూ ఒకప్పటి చరిష్మాను కోల్పోయారు. దీనికి తోడు ఒకపట్లగా వీరిద్దరూ జంటగా కనిపించడం మానేశారు. ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాలలో ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకున్నారు. అయితే వీరి వ్యవహార శైలి అభిమానులు అంతగా పట్టించుకోలేదు. పైగా పెళ్లికి సంబంధించిన ఫోటోలను డిలీట్ చేశారు. వీరిని దగ్గరగా గమనిస్తూ వస్తున్న కొంతమందికి మాత్రమే ఏదో అనుమానం కలిగింది. చివరికి అదే నిజమైంది.
2018లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ చివరికి విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఏడు సంవత్సరాల వివాహ బంధానికి, రెండు దశాబ్దాల స్నేహ బంధానికి ముగింపు పలుకుతున్నట్టు సైనా నెహ్వాల్ తన సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేశారు. చాలా ఆలోచించిన తర్వాత పారుపల్లి కశ్యప్ తో విడిపోతున్నట్టు ఆమె ప్రకటించారు. ” కొన్ని సందర్భాలలో మనం సాగించే జీవితం ఇతర మార్గాల్లోకి ప్రయాణం సాగించేలా చేస్తుంది. అనేక చర్చలు జరిగాయి. సుదీర్ఘ ఆలోచనలు చోటుచేసుకున్నాయి. చివరికి నేను, పారుపల్లి కశ్యప్ విడిపోవాలని అనుకున్నాం. శాంతి కోసం, ఎదుగుదల కోసం, మరింత ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని” సైనా పేర్కొంది. ఇదే సమయంలో మా వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని ఆమె ఆ పోస్ట్ లో కోరింది. గోపీచంద్ అకాడమీలో వీరిద్దరూ కలుసుకున్నారు. ఆ తర్వాత అది స్నేహంగా.. అనంతరం ప్రేమగా మారింది. విడాకుల వ్యవహారాన్ని సైనా మాత్రమే బయటికి వెల్లడించింది. మరోవైపు కశ్యప్ తో తనకు అద్భుతమైన లక్షణాలు ఉన్నాయని సైనా ఈ సందర్భంగా ప్రకటించడం విశేషం.
భారతదేశ క్రీడా చరిత్రలో కరణం మల్లీశ్వరి తర్వాత ఒలంపిక్ మెడల్ సాధించిన రెండవ భారత మహిళగా సైనా పేర్కొంది. 2015లో బ్యాడ్మింటన్ విభాగంలో మహిళల ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు సాధించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా సైనా రికార్డ్ సృష్టించింది. రెండు సంవత్సరాల క్రితం జూన్ నెలలో ప్రొఫెషనల్ సర్క్యూట్ లో సైనా ఆడింది. పారుపల్లి కశ్యప్ 2014లో కామన్వెల్త్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. గత ఏడాది అతడు తన క్రీడా జీవితాన్ని ముగించాడు. ప్రస్తుతం శిక్షకుడిగా కొనసాగుతున్నాడు.
India’s star shuttlers Saina Nehwal and Parupalli Kashyap announce separation after 7 years of marriage pic.twitter.com/ttZKcfagez
— RCBIANS OFFICIAL (@RcbianOfficial) July 13, 2025