Today 14 July 2025 Horoscope: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశుల పై ప్రభావం పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై ధనిష్ట నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల ఉద్యోగులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంది. వ్యాపారులు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం 12 రాశుల ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి…
Also Read: లార్డ్స్ లో తిప్పేసిన వాషింగ్టన్ సుందర్.. కుప్పకూలిన ఇంగ్లాండ్.. భారత్ టార్గెట్ ఎంతంటే?
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : . ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. రోజువారి పనుల్లో కొన్ని మార్పులు ఉంటాయి. వ్యాపారులకు లాభాలు రావడానికి కాస్త కష్టం అవుతుంది. పెట్టుబడుల గురించి కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. అనవసరంగా డబ్బు ఇతరుల చేతుల్లోకి వెళుతుంది. అందువల్ల ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు తోటి వారితో సంయమనం పాటించాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఉద్యోగులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలి. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడినప్పుడు మాత్రమే ఉంచుకోవాలి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పాటించాలి. వ్యాపారులు సాధారణ లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): గతంలో కంటే ఈ రాశి వారి ఆదాయం ఇప్పుడు మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. చుట్టుపక్కల ఉన్న వారితో విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు కొత్తగా పెట్టుబడును పెడతారు. ఈ సమయంలో పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ఆరోగ్యంపై ఏ చిన్న నిర్లక్ష్యం వహించిన ఇబ్బందులు ఎదుర్కొంటారు. వివాహ ప్రయత్నాల్లో బిజీగా ఉంటారు. వ్యాపారులు లాభాలను పొందడానికి కష్టపడాల్సి వస్తుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి వేధింపులు ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలో కాస్త ఓర్పు ఉండాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారి ఉద్యోగులకు కొత్త ఆదాయం వచ్చే అవకాశం ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు ఉంటాయి. కొత్త పెట్టుబడుల కోసం భాగస్వాములతో చర్చిస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. ఆలోచనలు నియంత్రించుకోవాలి. ఎదుటివారిపై ఆగ్రహం వ్యక్తం చేయకుండా ఉండాలి. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకునే విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు అనుకూలమైన వాతావరణ ఉంటుంది. కొన్ని ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొందరికి పదోన్నతులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. గతంలో అనుకున్న పనులను ఇప్పుడు పూర్తి చేస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : మీ రాశి వారు ఈ రోజు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. కొన్ని పనులను పూర్తి చేయడంతో సమాజంలో గుర్తింపు వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కొందరు అనవసరంగా ఇబ్బందులు పెట్టాలని చూస్తుంటారు. అయితే వారిని చాకచక్యంగా ఎదుర్కొంటారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : అనవసరపు వివాదాలకి తల దూర్చవద్దు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి. జీవిత భాగస్వామితో గొడవలు ఉంటాయి. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడమే మంచిది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఏదైనా మాట్లాడేటప్పుడు వెనుక ముందు ఆలోచించాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఇతరులకు డబ్బు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. ఎందుకంటే ప్రస్తుతం డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. కొత్తగా పెట్టుబడును పెట్టాల్సి వస్తే పెద్దల సలహా తీసుకోవాలి. సాయంత్రం ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా గడుపుతారు. ప్రియమైన వారికోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనుబంధాలు బలపడతాయి. కొన్ని సమస్యలను పరిష్కరించడానికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. వ్యాపారులు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఆరోగ్య విషయంలో ఈ రాజు వారు ఈ రోజు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇష్టమైన ఆహారాన్ని తీసుకుంటారు. అయితే వీటిలో నాణ్యతను గుర్తుంచుకోవాలి. విద్యార్థులు భవిష్యత్తు గురించి కీలకమైన పరీక్షలో పాల్గొంటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. గతంలో చేపట్టిన పనులను ఉద్యోగులు విజయవంతంగా పూర్తి చేస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . . వ్యాపారులకు ఈరోజు సాధారణ లాభాలు ఉంటాయి. ఎవరితోనైనా డబ్బు వ్యవహారం జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రతికూల ఆలోచనలు రాకుండా చూడాలి. ఉద్యోగులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే ఆలోచించాలి. ఇతరులకు డబ్బు ఇచ్చేందుకు అనువైన సమయం కాదు.