Sai Sudarshan : వామ్మో సాయి సుదర్శన్ ఏమా బ్యాటింగ్.. టీమిండియాలో చోటు కోసం కర్చీఫ్ వేసినట్టే..!

ఏసిసి మెన్స్ ఎమర్జింగ్ టోర్నీలో భాగంగా బుధవారం పాకిస్తాన్ ఏ జట్టుతో జరిగిన మ్యాచ్ లో సుదర్శన్ అదరగొట్టాడు. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు పది వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 8 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ లో సాయి సుదర్శన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 110 బంతుల్లో 104 పరుగులు చేసిన సాయి సుదర్శన్ నాటౌట్ గా నిలిచాడు.

Written By: BS, Updated On : July 20, 2023 8:09 pm
Follow us on

Sai Sudarshan : టీమిండియాలో చోటు కోసం నిరీక్షిస్తున్న యువ ఆటగాళ్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియాకు ఆడటమే లక్ష్యంగా ఎంతో మంది ఆటగాళ్లు పెట్టుకున్నారు. ఈ జాబితా రోజురోజుకు పెరిగిపోతోంది. ఎప్పుడు చోటు దక్కుతుందా..? అని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆటగాళ్లకు తోడు.. మరికొందరు యువ ఆటగాళ్లు అద్వితీయమైన ప్రదర్శన చేస్తూ టీమిండియా గేట్లు తడుతున్నారు. ఈ జాబితా రోజురోజుకు పెరిగిపోతుండడం సెలక్టర్లకు ఇబ్బందికరంగా మారుతోంది. తాజాగా పాకిస్తాన్ ఏ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన సాయి సుదర్శన్ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు.
భారత క్రికెట్ జట్టులో చోటు ఆశిస్తున్న యువ ఆటగాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. కొన్నేళ్లుగా టీమిండియా కు ఆడాలని పరితపించి నిరీక్షిస్తున్న కొందరికి ఇప్పుడిప్పుడే అవకాశాలు దక్కుతున్నాయి. వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో టీమిండియా యంగ్ క్రికెటర్లు ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్ వంటి ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ఇంకా ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఐపిఎల్ లో అదరగొట్టి ఇండియా జట్టులో చోటు కోసం తానున్నాను అంటూ తెలియజేసిన సాయి సుదర్శన్.. తనకు మాత్రం బెర్త్ కన్ఫామ్ చేయాలంటూ డేంజర్ బెల్స్ మోగించేలా తాజాగా మరో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఏసిసి మెన్స్ ఎమర్జింగ్ టోర్నీలో పాకిస్తాన్ ఏ జట్టుతో జరిగిన మ్యాచ్ లో అజేయ శతకాన్ని బాది జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. ఈ ప్రదర్శన ద్వారా ఇండియా జట్టులో చోటు కోసం సాయి సుదర్శన్ కర్చీఫ్ వేసినట్లు అయింది.
ఐపీఎల్ లోను అదరగొట్టిన సాయి సుదర్శన్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా సాయి సుదర్శన్ అదరగొట్టాడు. ఇప్పటి వరకు 13 మ్యాచ్ లు ఆడిన సాయి అద్భుతమైన ఆట తీరుతో అలరించాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడి పరుగులు వరద పారించాడు. పది ఇన్నింగ్స్ లో వరుసగా 53, 19, 20, 47, 43, 96 (ఐపీఎల్ ఫైనల్) పరుగులు చేసి అదరగొట్టాడు. అమెరికా లీగ్ లో కూడా ఆడుతున్న సాయి అద్భుతమైన ప్రదర్శన చేస్తూ అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే భారత జట్టుకు ఎంపిక చేయాలన్న డిమాండు సర్వత్ర వినిపిస్తోంది. తమిళనాడుకు చెందిన ఈ యంగ్ క్రికెటర్ లో వేగం, బ్యాటింగ్ లో టెక్నిక్, అద్భుతమైన నైపుణ్యం ఉండడంతో మెరుగైన ఆటగాడిగా రాణిస్తాడు అని విశ్లేషకులు కూడా చెబుతున్నారు.
పాకిస్తాన్ తో మ్యాచ్ లో అజేయ సెంచరీ..
ఏసిసి మెన్స్ ఎమర్జింగ్ టోర్నీలో భాగంగా బుధవారం పాకిస్తాన్ ఏ జట్టుతో జరిగిన మ్యాచ్ లో సుదర్శన్ అదరగొట్టాడు. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు పది వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 8 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ లో సాయి సుదర్శన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 110 బంతుల్లో 104 పరుగులు చేసిన సాయి సుదర్శన్ నాటౌట్ గా నిలిచాడు. ఈ క్రమంలోనే 10 ఫోర్లు, మూడు సిక్స్ లతో పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్ లో 94.5 సగటుతో సాయి సుదర్శన్ పరుగులు చేశాడు. అద్భుతమైన ఆట తీరు కనబరుస్తున్న సాయి సుదర్శన్ గత కొంత కాలం నుంచి నిలకడగా రాణిస్తూ భారత జట్టులో చోటు కోసం ప్రయత్నిస్తున్నాడు. యంగ్ టీమును సిద్ధం చేస్తున్న బిసిసిఐ సాయి సుదర్శన్ కు అవకాశాలు కల్పించాలి అంటూ డిమాండ్ వినిపిస్తోంది. ఇదే విధమైన ప్రదర్శన చేస్తే తప్పకుండా టీమిండియాలో చోటు కల్పించాల్సిన పరిస్థితి బీసీసీఐకి ఏర్పడుతుందని పలువురు క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.