Nara Dishti Remedies : మీకు దిష్టి తగులుతోందా? నరదృష్టి మీ దరికి రావద్దంటే ఇలా చేయండి

దిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి. దిష్టి లేకుండా పోవాలంటే ఎండు మిరపకాయలు, చిన్న ఆవాలు, ఉప్పు కలిపి పిల్లలపై ఏడు సార్లు తిప్పి మంటలో పడేయాలి. ఇలా చేయడం వల్ల దిష్టి పోతుంది

Written By: Srinivas, Updated On : July 20, 2023 8:23 pm
Follow us on

Nara Dishti Remedies : నరుడి చూపుకు నల్లరాయైనా పగులుతుంది. దిష్టికి ఉన్న మహత్యం అలాంటిది. మనుషుల కళ్లు మహా డేంజర్ అంటారు. ఈ సమస్య చిన్న పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దిష్టి తగలకుండా ఉండటానికి ఇంటికి గుమ్మడికాయ కడతాం. దిష్టిబొమ్మ కడతాం. మిరపకాయలు, జీడిగింజలు కలిపి కడుతుంటాం. ఇంకా నక్కపీట గంట కూడా కడతాం. ఇలా దిష్టిని రకరకాలుగా చెబుతుంటారు.

దిష్టి ఎలా తీయాలి?

దిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి. దిష్టి లేకుండా పోవాలంటే ఎండు మిరపకాయలు, చిన్న ఆవాలు, ఉప్పు కలిపి పిల్లలపై ఏడు సార్లు తిప్పి మంటలో పడేయాలి. ఇలా చేయడం వల్ల దిష్టి పోతుంది. మనుషుల కళ్లు పడ్డప్పుడు దిష్టి తగులుతుందని అంటారు. అందుకే ఇలా మిరపకాయలు, ఆవాలు, ఉప్పుతో దిష్టి తీసుకుంటే దిష్టి లేకుడా పోతుంది.

చిన్నపిల్లలకు..

చిన్న పిల్లలకు దిష్టి తీయడానికి ఒక చెంచా ఉప్పుతో పాటు ఆవపిండి అరచేతిలో తీసుకుని రెండింటిని పిల్లల తలపై ఏడుసార్లు తిప్పాలి. తరువాత వాటిని ఇంటి బయట పడేయాలి. పిల్లలపై చెడు దిష్టి పోవాలంటే శనివారం ఆంజనేయుడి ఆలయానికి తీసుకెళ్లండి. పిల్లల నుదుటిపై ఆంజనేయ సిందూరాన్ని పెడితే ఎంతటి నరదిష్టి అయినా పోతుంది.

జ్యోతిష్య శాస్త్రం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పిల్లలకు దిష్టి తగిలినప్పుడు ఎండు మిరపకాయలతో తీసేయొచ్చు. ఏడు ఎండు మిరపకాయలు తీసుకుని వాటిని సవ్య దిశలో పిల్లలపై తిప్పి ఏడుసార్లు తిప్పి పడేయాలి. చెడు దిష్టిని దూరం చేసుకోవాలంటే కొన్ని పరిహారాలు పాటించాలి. కుటుంబంలో తలెత్తే దిష్టిని తొలగించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.