Shaun Marsh: రోజు శాకాహారం తినేవారికి..ఉన్నట్టుండి మాంసాహారం పెడితే ఎలా ఉంటుంది.. రోజూ బ్లాక్ అండ్ వైట్ టీవీ చూసే వారికి ఒక్కసారిగా ఎల్ ఈడీ టీవీ చూపిస్తే ఎలా ఉంటుంది.. సేమ్ ఈ ఆటగాళ్లకు కూడా ఐపీఎల్ అలాంటి అనుభవమే ఇచ్చింది. కాకపోతే ఆ తర్వాత కథ మొత్తం మారిపోయింది.
వైట్ బాల్ ఫార్మాట్ లో వన్డే ఒకరకంగా ఉంటుంది.. టి20 ఒకరకంగా ఉంటుంది. వన్డే అనేది 50 ఓవర్ల మ్యాచ్. ఒక్కోసారి మైదానం తడిగా ఉంటే.. వర్షం కురిస్తే ఓవర్లు తగ్గుతాయి. కానీ అవి అరుదైన సందర్భాల్లో మాత్రమే చోటు చేసుకుంటాయి. ఇక టి20 విషయంలో అలా ఉండదు.. తక్కువ వ్యవధిలో ఎక్కువ పరుగులు చేయాలి. వికెట్లు కూడా వేగంగా తీయాలి. ఇలాంటి ఫార్మాట్ కు సాధారణంగా అన్ని జట్లు యువకులను ఎంపిక చేస్తాయి. ఒకవేళ సీనియర్లు కనుక గొప్పగా ఆడుతూ ఉంటే వారికి అవకాశాలు ఇస్తాయి. అయితే టి20 ఫార్మాట్ కు, ఐపీఎల్ ఫార్మాట్ కు చాలా తేడా ఉంటుంది. టి20 లో ఆడిన ఆటగాళ్లు ఐపీఎల్లో రాణించిన సందర్భాలు తక్కువ.. అయితే టి20 లలో మెరుపు వేగంతో పరుగులు తీసిన ఆటగాళ్లు సైతం ఐపీఎల్ కు వచ్చేసరికి తేలిపోయారు. అందులో గేల్ నుంచి మొదలు పెడితే హెడెన్ వరకు ఉన్నారు.
30 ఇన్నింగ్స్ ల తర్వాతే..
టి20 లలో షాన్ మార్ష్ సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అతడు ఐపిఎల్ లో మాత్రం మొదటి 30 ఇన్నింగ్స్ లలో పెద్దగా ఆకట్టుకోలేదు. వాస్తవానికి 30 ఇన్నింగ్స్ ల తర్వాతే అతడు ఏంటో నిరూపించుకోవడం మొదలుపెట్టాడు. ఏకంగా ఇప్పుడు అతడు 1,338 పరుగులు చేశాడు. ఇందులో అతడి యావరేజ్ 53.52, స్ట్రైక్ రేట్ 139.52. ఇక సాయి సుదర్శన్ కూడా మొదటి 30 ఇన్నింగ్స్ లలో పెద్దగా పరుగులు చేయలేదు. ఆ తర్వాత అతడు ఒక్కసారిగా జోరు అందుకున్నాడు. ఇప్పుడు అతడు 1,307 పరుగులు చేశాడు. ఇందులో అతడు యావరేజ్ 48.40, స్ట్రైక్ రేట్ 141.60..క్రిస్ గేల్ కూడా తొలిముపై ఇన్నింగ్స్ ల తర్వాత పరుగుల వేగం పెంచాడు. అతడేకంగా 1,141 పరుగులు చేశాడు. ఇందులో అతడు యావరేజ్ 43.88, స్ట్రైక్ రేట్ 162.53. కెన్ విలియమ్సన్ కూడా మొదటి 30 ఇన్నింగ్స్ లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత అతడు తన అసలు సిసలైన దూకుడు మొదలుపెట్టాడు. 1096 పరుగులు చేశాడు. ఇందులో అతడు యావరేజ్ 43.84, స్ట్రైక్ రేట్ ఇక మాథ్యూ హెడెన్ కూడా తొలి ముపై ఇన్నింగ్స్ లలో పెద్దగా రాణించలేకపోయాడు. ఆ తర్వాత 1082 పరుగులు చేశాడు. ఇందులో అతడి యావరేజ్ 38.64, స్ట్రైక్ రేట్ 141.43.