SAFF Championship 2023: మైదానంలో ఆటాలాడుకోవాల్సిన ప్లేయర్లు కొట్టుకున్నారు. ఒకరిని మరొకరు తోసేస్తూ కిందపడేసుకున్నారు. ఆ తరువాత రెండు దేశాల ఆటగాళ్లు ఒక్కసారిగా దాడికి దిగబడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దక్షిణాసియా ఫుట్ బాల్ ఛాంఫియన్ షిప్ లో భాగంగా జరిగిన ఈ సంఘటన కు సంబంధించిన వీడియో వైరల్ గామారింది. ఈ వీడియోలో భారత్, కువైట్ ఫుట్ బాల్ ప్లేయర్లు ఇరవురు తీవ్రంగా గొడవ పడడం చర్చనీయాంశంగా మారింది.
దక్షిణాసియా ఫుట్ బాల్ ఛాంఫియన్ షిప్ లో భాగంగా టాపర్స్ భారత్, కువైట్ జట్లు తలపడేందుకు మైదానంలోకి దిగాయి. తొలి సగం వరకు ఒక్క గోల్ కూడా ఎవరూ చేయలేదు. రెండో సగంలో మాత్రం భారత్ కెప్టెన్ సునీల్ చెత్రీ గోల్ చేశాడు. ఆయితే ఆట ముగిసే సమయానికి కువైట్ ఆటగాడు అన్వర్ అలీ గోట్ చేశాడు. దీంతో స్కోర్ సమం అయి డ్రాగా ముగిసింది. ఆ తరువాత ఫుట్ బాల్ ప్రతినిధులు దీనిని డ్రాగా ప్రకటించారు.
అయితే ఈ సమయంలో కువైట్ ఆటగాడు హమద్ అల్ కల్లాఫ్ అక్కడున్న భారత్ ప్లేయర్ సహల్ సమద్ ను కిందకు తోశాడు. అది చూసిన తోటి భారత్ ఆటగాడు ఆగ్రహంతో రగిలిపోయాడు. దీంతో ఆయన సహాల్ ను నెట్టేశాడు. ఇలా వీరిని చూసిన భారత్, కువైట్ ప్లేయర్లు అక్కడికి వచ్చి ఒకరిపై ఒకరు దాడికి దిగబడ్డారు. ఆ తరువాత మైదానంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే గొడవకు కారణమైన ఇండియా ప్లేయర్ రహీమ్ అలీ, కువైట్ ఆటగాడు అల్ ఖలాఫ్ లకు రెపరీ రెడ్ కార్డు చూపించి బయటకు పంపారు. ఈ వీడియోను మీరూ చూడండి.
#SAFFChampionship2023 #INDvKUW
Sunil Chhetri scores for the third match running in Bengaluru! Unreal ability to score from corner situations pic.twitter.com/DAhmJth9tc
— Dilip Unnikrishnan (@DilipUnnikrishn) June 27, 2023