Sachin Baby : ఐపీఎల్ లో ఏజ్ ఎక్కువగా ఉన్న ఆటగాళ్ల జాబితాలో చాలామంది ఉన్నారు. అందులో 36 సంవత్సరాల సచిన్ బేబి కూడా ఒకడు. ఇతడిని గత మెగా వేలంలో హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసింది. అయితే ఇన్ని రోజులపాటు అతని రిజర్వ్ బెంచ్ కే పరిమితం చేసింది. సోమవారం నాటి ఢిల్లీ మ్యాచ్లో అతనికి అవకాశం కల్పించింది. అయితే సచిన్ బేబి తన చివరిసారి ఐపీఎల్ మ్యాచ్ 2021 లో ఆడాడు. దాదాపు నాలుగు సంవత్సరాల గ్యాప్ తర్వాత అతడు ఐపిఎల్ లోకి వచ్చాడు.. దాదాపు మూడు సంవత్సరాల ఏడు నెలల 15 రోజుల తర్వాత అతడు ఐపీఎల్లోకి ప్రవేశించడం విశేషం.. అయితే ఈ జాబితాలో అత్యధిక గ్యాప్ తర్వాత ఐపీఎల్లోకి ప్రవేశించిన ఆటగాళ్ల వివరాలను ఒకసారి పరిశీలిస్తే.
Also Read : గెలిచేదే.. ఈ తప్పులు చేసింది కాబట్టే హైదరాబాద్ ఓడింది
1.హర్ ప్రీత్ భాటియా, 3,981 రోజులు
2012లో పూణే వారియర్స్ ఇండియా తరఫున ఇతడు ఆడాడు. ఆ తర్వాత 11 సంవత్సరాల గ్యాప్ అనంతరం 2023లో పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున ఐపీఎల్ లో కి మళ్ళీ ప్రవేశించాడు.
2.మాథ్యూ వేడ్, 3,962 రోజులు
వేడ్ 2022లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అంతకుముందు అంటే 2012లో అతడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. దాదాపు 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత అతడు ఐపీఎల్లోకి ప్రవేశించాడు.
3.వేన్ పార్నెల్, 3,242 రోజులు
2014లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అతడు ఆడాడు. 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత గత ఏడాది అతడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరుపున ఆడాడు. దక్షిణాఫ్రికా జట్టులో ఇతడు ఆల్రౌండర్ గా ఉన్నాడు.
4.రిలీ రోసో, 2,899 రోజులు
రోసో 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఆడాడు. 2015లో అతడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడాడు. అంటే 8 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ ఐపీఎల్లోకి వచ్చాడు.
5.కాలిన్ ఇంగ్రామ్, 2,019 రోజులు
కాలిన్ ఇంగ్రామ్ 2011లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఆడాడు. ఆ తర్వాత ఎనిమిదేళ్ల గ్యాప్ అనంతరం 2019లో మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ లోకి ప్రవేశించాడు.
ఈ ఆటగాళ్లు మెరుగైన ప్రతిభ చూపించినప్పటికీ.. కీలక సందర్భాల్లో ఆడలేక పోయారు. అందువల్లే వీరిని జట్టులోకి తీసుకోవడానికి యాజమాన్యాలు అంతగా ఆసక్తి చూపించలేదు. అందువల్లే వీరికి ఏళ్లపాటు గ్యాప్ వచ్చింది. ఇక తదుపరి అవకాశాలలో కూడా వీరు అంతగా రాణించలేకపోయారు. అందువల్లే మీరు అంతగా వెలుగులోకి రాలేకపోయారు. ఈ సీజన్లో సచిన్ బేబి జట్టులోకి అందుబాటులోకి వచ్చినప్పటికీ.. అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఎడమ చేతివాటంతో అతడు బ్యాటింగ్ చేస్తాడు. ఈ సీజన్లో ఢిల్లీ జట్టుతో ఆడేందుకు హైదరాబాద్ యాజమాన్యం అతడిని తుది జట్టులోకి తీసుకుంది.
Also Read: యష్ దయాళ్..నాడు తిట్టారు.. నేడు హీరో అంటూ పొగుడుతున్నారు..