Pawan Kalyan : పిఠాపురం( Pithapuram ) నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు పవన్ కళ్యాణ్. 2024 ఎన్నికలకు ముందు పిఠాపురం అనేది ఒక సామాన్య నియోజకవర్గం. 175 నియోజకవర్గాల్లో అది ఒకటి. కానీ పవన్ పోటీ చేసిన తర్వాత, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, మంత్రి పదవులు చేపట్టాక పిఠాపురం నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు అదే పిఠాపురంలో బిందెడు నీటి కోసం మహిళలు పడిగాపులు పడాల్సి వస్తోంది. నిజంగా ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఇబ్బందికరంగా మారింది. డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో పరిస్థితి ఇలా ఉందంటే.. మిగతా వాటిలో ఎలా ఉంటుందో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Also Read : అభిమానికి సెల్ఫీ ఇవ్వడానికి నిరాకరించిన అల్లు అర్జున్..వీడియో వైరల్!
* స్థానికుల్లో ఆందోళన..
పిఠాపురం నియోజకవర్గంలో శాశ్వత సమస్యలకు పరిష్కారం లభించింది. కానీ తాగునీటి సమస్య( drinking water problem) మాత్రం తీవ్రంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం వేసవి మండుతోంది. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో నీటి ఎద్దడి నెలకొంది. దీంతో అక్కడి ప్రజలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మంచినీరు ఇచ్చి పుణ్యం కట్టుకోండి అంటూ వేడుకుంటున్నారు. ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలోని యు.కొత్తపల్లి, ఉప్పాడ మండలాల్లో పరిస్థితి తీవ్రతరంగా ఉంది. దీంతో నీటి కోసం మహిళలు సుదూర ప్రాంతాలు వెళ్లాల్సి వస్తోంది.
* జల జీవన్ మిషన్ ద్వారా..
పిఠాపురం నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు పరిష్కారం చూద్దామని అధికారులు చెబుతున్నారు. జలజీవన్ మిషన్( gala Jivan mission) ద్వారా ప్రతి ఇంటికి కొళాయి నీరు అందిస్తున్నామని ప్రకటిస్తున్నారు. పవన్ ఎమ్మెల్యే అయిన తర్వాత 10 నెలల్లోనే కేంద్ర ప్రాజెక్టు అయిన జలజీవన్ మిషన్ మీద దృష్టి పెట్టారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ప్రధానంగా జలజీవన్ మిషన్ పథకం అమలు సరిగ్గా లేదన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో తమకు తాగునీరు లేదని.. దాహార్తిని తీర్చేది ఎవరు అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాగునీటి సమస్యపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
* ఎన్నో సమస్యలకు పరిష్కారం..
వాస్తవానికి పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan) ప్రమాణస్వీకారం తర్వాత చాలా సమస్యలకు మోక్షం కలిగింది. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యలకు సైతం పవన్ కళ్యాణ్ పరిష్కార మార్గం చూపించారు. అదే సమయంలో పిఠాపురంలో తాగునీటి సమస్య లేకుండా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అధికారుల సైతం ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. తీరా వేసవి లో భూగర్భ జలాలు ఒక్కసారిగా అడుగంటడం, కుళాయిలు పనిచేయకపోవడంతో పిఠాపురం ప్రజలు పడుతున్న బాధలు అన్నీ ఇన్ని కావు. పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలోకి వచ్చి సమస్యకు పరిష్కార మార్గం చూపాలని పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.
Also Read : పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త..ఈసారి మిస్ అయ్యే ప్రసక్తే లేదు!