SRH Vs GT IPL 2025: ముందుగా బ్యాటింగ్ చేస్తున్న గుజరాత్ జట్టు హైదరాబాద్ బౌలింగ్ ను తునాతునకలు చేసింది. సాయి సుదర్శన్, గిల్, బట్లర్ త్రయం దుమ్మురేపింది. హైదరాబాద్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వీరు ముగ్గురు వీరవిహారం చేశారు. వీరి దూకుడుకు అడ్డుకట్ట వేయలేకపోగా.. హైదరాబాద్ జట్టు తప్పులు చేసింది. తద్వారా గుజరాత్ భారీ స్కోర్(225) చేసింది. దాన్ని చేయించడంలో హైదరాబాద్ దారుణంగా విఫలమైంది. వ్యూహాత్మకంగా వ్యవహరించకపోవడం.. ఆటగాళ్ల విషయంలో మేనేజ్మెంట్ పకడ్బందీ ప్రణాళిక రచించకపోవడంతో.. దారుణమైన ఫలితం హైదరాబాద్ జట్టుకు వచ్చింది.. ఈ మ్యాచ్ ప్రారంభంలో హైదరాబాద్ ఫీల్డింగ్ లో లోపాలు కనిపించాయి. బట్లర్, గిల్ క్యాచ్ లను హైదరాబాద్ ఫీల్డర్లు సులువుగా వదిలేశారు..గిల్ 38 పరుల వద్ద ఉన్నప్పుడు అభిషేక్ శర్మ ఒక క్యాచ్ వదిలేశాడు. అది గనుక పట్టి ఉంటే మ్యాచ్ పరిస్థితి మరో విధంగా ఉండేది.. మరోవైపు బట్లర్ క్యాచ్ ను కమిన్స్ మిస్ చేసాడు. ఇదే విషయాన్ని అతడు ఒప్పుకున్నాడు కూడా.
Also Read: ఎందుకు రావట్లేదు లోకేష్.. మోడీ ప్రశ్నకు కారణమేంటి?
బౌలింగ్ లో దారుణం
హైదరాబాద్ బౌలింగ్ అత్యంత దారుణంగా ఉంది.. గుజరాత్ బ్యాటర్లు అందువల్లే పండగ చేసుకున్నారు. ఫోర్లు, సిక్సర్లు కొట్టారు. ముఖ్యంగా షమీ అత్యంత దారుణంగా బౌలింగ్ వేసాడు. జీషాన్ అన్సారీ వంటి స్పిన్నర్ తో కనుక పవర్ ప్లే లో బౌలింగ్ వేయించి ఉంటే మరో విధంగా ఉండేది. బ్యాటింగ్ ఆర్డర్ కూడా అత్యంత దారుణంగా ఉంది. హెడ్ (20) స్వల్ప వ్యవధిలోనే అవుట్ అయినప్పటికీ.. అభిషేక్ శర్మ (74) వీర విహారం చేశాడు. అయితే కిషన్ (17) టెస్ట్ తరహాలో బ్యాటింగ్ చేయడం వల్ల రన్ రేట్ ఏమాత్రం ముందుకు పడలేదు. మూడో స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి ని కనుక పంపించి ఉంటే బాగుండేది. క్లాసెన్ ను నాలుగో స్థానంలో పంపి ఉంటే కాస్త ఫలితం ఉండేది. ఇషాన్ కిషన్ ను ఆరో స్థానంలో పంపించి ఉంటే ప్రయోజనం లభించేది. రషీద్ ఖాన్, సాయి కిషోర్ వంటి స్పిన్నర్లు హైదరాబాద్ ఆటగాళ్లలో పూర్తిగా కట్టడి చేశారు. రషీద్ ఖాన్ పరుగులు ఇచ్చినప్పటికీ కీలక సమయంలో వికెట్లు పడగొట్టాడు.. అహ్మదాబాద్ మైదానంపై వికెట్లు తీయడంలో హైదరాబాద్ బౌలర్లు విఫలమైతే.. గుజరాత్ బౌలర్లు మాత్రం సత్తా చూపించారు. హైదరాబాద్ ఆటగాళ్లు బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో సత్తా చూపించి ఉంటే గుజరాత్ 200ల లోపు పరుగులు చేసి ఉండేది. అలా చేయకపోవడం వల్ల దాని ఫలితాన్ని హైదరాబాద్ జట్టు అనుభవించింది. ఈ ఓటమి వల్ల హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారిపోయాయి. ఆ జట్టు ప్లే ఆఫ్ దాకా వెళ్లాలంటే దాదాపు అద్భుతాలు జరగాలి.
Also Read: గుజరాత్ టైటాన్స్ సంచలనం.. ఐపీఎల్ లో సరికొత్త రికార్డు