SA20 Results: ఐపీఎల్ లోనే కాక సౌతాఫ్రికా t20 క్రికెట్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్ కు ఒక జట్టు ఉంది. ఆ జట్టు పేరు సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్. ఒక సీజన్లో సౌత్ ఆఫ్రికా t20 క్రికెట్ లీగ్ లో విజేతగా కూడా నిలిచింది కావ్య జట్టు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో మరో సీజన్ కూడా మొదలైంది. ఈ సీజన్లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన కావ్య జట్టు విజయం సాధించింది. ట్రెటోరియ క్యాపిటల్స్ జట్టును 48 పరుగుల తేడాతో మట్టి కరిపించింది..
కావ్య జట్టులో క్వింటన్ డికాక్ 77 పరుగులు చేశాడు. మాథ్యూ బ్రిట్జ్ కే 52 పరుగులు చేశాడు. వీరిద్దరి దూకుడు వల్ల సన్ రైజర్స్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ట్విటోరియా జట్టు బౌలర్లలో మిల్స్ 2 వికెట్లు పడగొట్టాడు.
ఆ తర్వాత 189 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన ప్రిటోరియ జట్టు 140 పరుగుల వరకే ఆగిపోయింది. తద్వారా 48 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. వాస్తవానికి ఈ మ్యాచ్లో కావ్య జట్టు 200 కుమించి పరుగులు చేస్తుందని అందరూ అనుకున్నారు. అయితే చివరి మూడు ఓవర్లలో ప్రిటోరియ జట్టు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేశారు. దీంతో కావ్య జట్టు కేవలం 20 పరుగులు మాత్రమే చేయగలిగింది.. లక్ష్యాన్ని చేదించే క్రమంలో రంగంలోకి దిగిన ప్రిటోరియ జట్టు ఘనమైన ఆరంభాన్ని అందుకుంది. ఈ దశలో కావ్య జట్టు బౌలర్ ఆడం మిల్నే నాలుగు వికెట్లు పడగొట్టాడు. అయితే వీల్ స్మేడ్ ప్రేటోరియా జట్టుకు గెలుపు మీద ఆశలు కల్పించాడు. ఒక దశలో 58 బంతుల్లో 92 పరుగులకు ప్రిటోరియ జట్టు విజయ సమీకరణం మారిపోయింది . అప్పటికి ఆ జట్టు చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. ఈ దశలో ముత్తుస్వామి అద్భుతంగా బౌలింగ్ వేశాడు. స్మీడ్ ను ముత్తుస్వామి క్లీన్ బౌల్ద్ చేశాడు. దీంతో 14 పరుగుల వ్యవధిలోనే ప్రిటోరియా జట్టు మూడు వికెట్లు నష్టపోయింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. దీంతో ప్రిటోరియా జట్టు 48 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ విజయం ద్వారా కావ్య జట్టు బోనస్ పాయింట్ అందుకుంది.