RR Vs RCB: ఈ ఐపీఎల్ లో తొలి మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఇన్నింగ్స్ సమయంలో.. అ ప్రేక్షకుడు మైదానంలోకి వచ్చాడు. విరాట్ కోహ్లీని ఆలింగనం చేసుకున్నాడు.
ఆ సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. దానిని కొంతమంది పి ఆర్ ట్రిక్స్ అని కూడా ఆరోపించారు. సరిగా మళ్ళీ ఇన్ని రోజులకు అటువంటి సంఘటన మరొకటి జరిగింది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ విధించిన 174 రన్స్ టార్గెట్ ను ఒక్క వికెట్ కోల్పోయి చేదించింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. తద్వారా టి20 లలో 100 హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆసియా ఖండంలోనే ఈ ఘనత సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డ్ సృష్టించాడు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ 108 హాఫ్ సెంచరీలతో మొదటి స్థానంలో ఉన్నాడు.
పరుగులు పెట్టి పారిపోయాడు
మ్యాచ్లో విజయం సాధించిన అనంతరం బెంగళూరు ఆటగాళ్లు, ఇతర కోచింగ్ సిబ్బందితో విరాట్ కోహ్లీ మాట్లాడుతుండగా.. అకస్మాత్తుగా మైదానంలోకి ఓ అభిమాని వచ్చాడు. అంతే అతడు విరాట్ కోహ్లీ వైపు దూసుకు వచ్చాడు. అతని వాలకాన్ని చూసిన విరాట్ కోహ్లీ భయపడ్డాడు. అతడి నుంచి తనను తను కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. తన రెండు కాళ్ళకు పని చెప్పాడు. ఆ అభిమానికి దొరకకుండా దూరంగా పారిపోయాడు. ఆ తర్వాత మైదానంలోని సెక్యూరిటీ ఆ అభిమానిని పట్టుకున్నారు. ఆ తర్వాత అతని స్టేడియం బయటికి తీసుకెళ్లారు. ఈ సంఘటన జైపూర్ మైదానంలో సంచలనం కలిగించింది. అయితే ఐపీఎల్ లో అభిమానులు మైదానం లోపలికి రావడం కొత్తకాక పోయినప్పటికీ.. ప్రస్తుత ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ కే ఇలాంటి అనుభవాలు రెండు ఎదురు కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. మైదానంలో ఎంతోమంది బౌలర్లను భయపెట్టిన విరాట్ కోహ్లీ.. ఒక అభిమాని వల్ల భయపడడం నిజంగా ఆశ్చర్యం అనిపిస్తోందని నెటిజన్లు పేర్కొంటున్నారు.
Also Read: నాటు కొట్టుడు స్టైల్.. ఇదీ తెలుగోడు తిలక్ వర్మ అంటే.. అర్థమైందా హార్దిక్కూ!
పి ఆర్ ట్రిక్స్ కాదు కదా
అయితే మైదానంలో టైట్ సెక్యూరిటీ ఉంటుంది. నిత్యం పోలీసులు కూడా పహార కాస్తూ ఉంటారు. ఇక సీసీ కెమెరాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి చోట ఒక అభిమాని ఇన్ని వ్యవస్థల కళ్ళు కప్పి లోపలికి రావడం అంత సులభమైన విషయం కాదు. అయితే ఇలా జరగడం సాధ్యం కాదని మిగతా అభిమానులు అంటున్నారు. అయితే ఇలా చేయడం వెనుక పిఆర్ ట్రిక్స్ ఉన్నాయని విషయాన్ని కొట్టి పారేయలేమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. సినిమాల ముందస్తు విడుదల కార్యక్రమాలు జరిగినప్పుడు కొంతమంది అభిమానులు ఇలానే దూసుకు వస్తుంటారని.. అది ఆ సినిమాపై హైప్ పెంచడానికి ఉపయోగపడుతుందని.. ఇప్పుడు ఈ ట్రిక్స్ కూడా ఐపీఎల్ పై ఆదరణ పెరగడానికి దోహదం చేస్తాయని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
A fan entered the ground to meet Virat Kohli, but Kohli sneak away. pic.twitter.com/0CQpwJ91NH
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 13, 2025