RR Vs Mi IPL 2025: రాజస్థాన్ రాయల్స్ జట్టు తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన మేధాశక్తి ప్రదర్శించాడు.. తన బుద్ధి కుశలతను ప్రదర్శించాడు.. మైదానంలో అత్యంత తెలివిగా వ్యవహరించి రాజస్థాన్ రాయల్స్ ను దెబ్బ కొట్టాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ .. ఫారుఖీ బౌలింగ్ లో బంతిని ఆడలేక పోయాడు. ఆ బంతి లెగ్ స్టంప్ దిశగా అతని ప్యాడ్ తాకింది. దీంతో రాజస్థాన్ ఆటగాళ్లు ఫీల్డ్ అంపైర్ కు అప్పీల్ చేయగా.. అతడు అవుట్ ఇచ్చాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. రోహిత్ శర్మ రివ్యూ తీసుకున్నాడు. కాకపోతే ఈ రివ్యూ తీసుకోవడానికి అతడు చాలా సమయం తీసుకుని.. చివరికి రివ్యూ గడువు ముగుస్తుందనగా .. తన నిర్ణయాన్ని వెల్లడించాడు.. ఫీల్డ్ అంపైర్ తీసుకొన్న నిర్ణయాన్ని సమీక్షించిన థర్డ్ అంపైర్.. నాట్ అవుట్ అని ప్రకటించాడు.
Also Read: రాజస్థాన్ రాయల్స్.. గొర్రె మంద సామెతను నిజం చేసింది.
జోరు పెంచాడు
ఎప్పుడైతే నాట్ అవుట్ అని థర్డ్ అంపైర్ ప్రకటించాడో.. ఇక అప్పటినుంచి రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మరో ఓపెనర్ రికెల్టన్ సహాయంతో.. దూసుకుపోయాడు.. అబేధ్యమైన తొలి వికెట్ కు 116 పరుగులు జోడించాడు. రోహిత్ శర్మ 36 బంతులు ఎదుర్కొని.. 53 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది బౌండరీలు ఉన్నాయి. ఇక రోహిత్ శర్మ వరుసగా హాఫ్ సెంచరీ చేయడం ఈ ఐపిఎల్ సీజన్లో ఇది మూడవది. ఇటీవల కాలంలో హైదరాబాద్ జట్టుతో జరిగిన రెండు మ్యాచ్లలో రోహిత్ అదరగొట్టాడు. ఇక రాజస్థాన్ జట్టుపై కూడా అదే స్థాయిలో బ్యాటింగ్ చేశాడు. మైదానంలో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. ఏమాత్రం భయపడకుండా.. రాజస్థాన్ బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్ చేశాడు.. అతడి ఇన్నింగ్స్ లో ఒక్క సిక్సర్ కూడా లేకపోవడం విశేషం.. అయితే రోహిత్ ప్రారంభంలో కాస్త నిదానంగా ఆడినప్పటికీ.. ఆ తర్వాత అతడు తన జోరు చూపించాడు..
వివాదం మొదలైంది
Fixers @mipaltan pic.twitter.com/0XoSFOSJxT
— (@LoyalSRHfan) May 1, 2025
రివ్యూ తీసుకోవడానికి ఆటగాళ్లకు నిర్ణీత సమయం ఉంటుంది. ఆ సమయం తర్వాత రివ్యూ తీసుకోవడానికి ఆటగాళ్లకు అవకాశం ఉండదు. ఇక గురువారం నాటి మ్యాచ్లో రోహిత్ శర్మ గడువు ముగిసిన తర్వాత రివ్యూ తీసుకున్నాడు అని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. గడువు ముగిసిన తర్వాత అంపైర్లు ఎందుకు అనుమతించారని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.. గడువు ముగిసిన తర్వాత రివ్యూ తీసుకున్నాడని.. అంపైర్లు అలా ఎందుకు అనుమతించారని సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి.. అయితే ఐసీసీ నిబంధనలు ప్రకారం ఆటగాళ్లు అలా రివ్యూ తీసుకోవచ్చని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇందులో వివాదానికి ఆస్కారం లేదని వారు ఈ సందర్భంగా పేర్కొంటున్నారు.
Also Read: వరుసగా “ఆరు”.. మరే జట్టుకు సాధ్యం కాని రికార్డ్.. ముంబై ఘనత